తెలంగాణలోని నిర్మల్ జిల్లా తానూర్ మండలం సింగన్‌గావ్‌లో విషాదం చోటుచేసుకుంది. స్థానిక చెరువులో ముగ్గురు బాలికల మృతదేహాలను స్థానికులు గుర్తించారు. సింగన్గావ్కు చెందిన బాలికలు.. వైశాలి, అస్మిత, అంజలి అదివారం నాడు అదృశ్యమయ్యారు. అస్మిత, వైశాలి అక్కా చెల్లెల్లు కాగా.. అంజలి వారి సమీప బంధువు. కనిపించకుండా పోయి.. రాత్రి అయినా ఇంటికి తిరిగి రాలేదు. కుటుంబసభ్యులు వెతికినా ప్రయోజనం లేకుండా పోయింది.
Dead Bodies: చెరువులో ముగ్గురు బాలికల మృతదేహాలు - తాజా క్రైం వార్తలు
రోజంతా.. ఆ అక్కాచెల్లెల్లు తమ సమీప బంధువైన మరో బాలికతో ఆడుకున్నారు. కేరింతలు కొడుతూ అల్లరి చేశారు. ఎన్నెన్నో ముచ్చట్లు చెప్పుకున్నారు. ప్రపంచాన్ని పట్టించుకోకుండా తమదైన లోకంలో నిమగ్నమయ్యారు. ఏం చేస్తున్నారోనని ఆరా తీద్దామనుకున్న తల్లిదండ్రులకు వీళ్లు ముగ్గురు కనిపించలేదు. అప్పటిదాకా అక్కడే ఉండి అకస్మాత్తుగా మాయమైపోయారు. రోజంతా వెతికినా జాడ కానరాలేదు. చివరికి తెల్లవారుజామున చెరువులో విగతజీవులుగా తేలారు. ఈ విషాద ఘటన తెలంగాణలోని నిర్మల్ జిల్లాలో చోటుచేసుకుంది.
చెరువులో ముగ్గురు బాలికల మృతదేహాలు
ఈరోజు ఉదయం చెరువులో బాలికల మృతదేహాలు కనిపించడంతో కుటుంబ సభ్యుల రోదనలు మిన్నంటాయి. ముగ్గురు బాలికల వయసు 16 ఏళ్ల లోపే ఉంటుందని కుటుంబసభ్యులు వెల్లడించారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు... బాలికలు ప్రమాదవశాత్తూ చెరువులో పడ్డారా? ఆత్మహత్యా? అన్న కోణంలో దర్యాప్తు చేస్తున్నారు.
- ఇదీ చదవండి :
అదుపుతప్పి ఆటో బోల్తా.. ఇద్దరు బాలురు మృతి
Last Updated : Jul 5, 2021, 1:27 PM IST