హైదరాబాద్ కూకట్‌పల్లి బ్యాంకు ఏటీఎం కేంద్రంలో కాల్పులు జరిపి.. నగదు దోచుకున్న కేసులో చిక్కిన దోపిడీ దొంగను సైబరాబాద్ పోలీసులు లోతుగా విచారణ చేస్తున్నారు. గతంలో ఎక్కడెక్కడ దోపిడీలకు పాల్పడ్డారు, జంటనగరాలతో పాటు రాష్ట్రంలో ఈ తరహా దోపిడీలు ఏమైనా చేశారా, ద్విచక్ర వాహనాలు ఎక్కడి నుంచి తీసుకువస్తున్నారు అనే కోణంలో విచారిస్తున్నారు.
నగరంలో వీరికి ఎవరు ఆశ్రయమిచ్చారు, ముఠాలో ఇద్దరేనా ఇంకా ఎవరైనా ఉన్నారా అనే కోణాల్లో విచారణ కొనసాగిస్తున్నారు. త్రుటిలో తప్పించుకున్న మరో దోపిడీ దొంగ కోసం కూడా పోలీసులు గాలిస్తున్నారు. ఒకటి రెండు రోజుల్లో ఈ విషయంపై సైబరాబాద్ పోలీస్ కమిషనర్ సజ్జనార్ మీడియా సమావేశం నిర్వహించే అవకాశం ఉంది.