దుకాణాల సమయం కుదింపు పుకార్లపై తెలంగాణ ప్రభుత్వం స్పందించింది. సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతున్న జీవో కాపీ నకిలీదని ఆ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్ స్పష్టం చేశారు. రాత్రి వేళ దుకాణాలు మూసివేత తప్పుడు వార్త అని పేర్కొన్నారు.
దుకాణాలు సాయంత్రం 6 గంటలకు మూసివేయాలంటూ ఉత్తర్వులు ఇచ్చామన్నది ఎంత మాత్రం నిజం కాదన్నారు. రాష్ట్రంలో లాక్‌డౌన్ ఉండదని స్పష్టం చేశారు. ఇలాంటి వాటిని ప్రచారం చేస్తే... అందుకు బాధ్యులైన వారిపై కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు.