పురపాలక శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ వ్యాఖ్యలతో రాజధాని రైతులు ఆందోళనలో ఉన్నారని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ పేర్కొన్నారు. రాజధానిపై ప్రభుత్వం స్పష్టమైన ప్రకటన చేయాలని డిమాండ్ చేశారు. బకాయి ఉన్న కౌలు మొత్తం తక్షణమే చెల్లించాలన్న రామకృష్ణ... రాజధాని నిర్మాణం నిలిచిపోవటంతో వేలాదిమంది కూలీలు రోడ్డున పడ్డారని ఆవేదన వ్యక్తం చేశారు. రాజధాని మార్పు ప్రభుత్వానికే నష్టం కలిగిస్తుందని అభిప్రాయపడ్డారు.
రాజధానిపై స్పష్టమైన ప్రకటన చేయాలి: రామకృష్ణ - farmers in amaravathi
మంత్రి బొత్స సత్యనారాయణ వ్యాఖ్యలతో రాజధాని ప్రాంత రైతులు ఆందోళనలో ఉన్నారని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ అన్నారు. రాజధానిపై స్పష్టమైన ప్రకటన చేయాలని ఆయన డిమాండ్ చేశారు.
రాజధానిపై స్పష్టమైన ప్రకటన చేయాలి: రామకృష్ణ