రాష్ట్రంలోని 1,658 ప్రభుత్వాసుపత్రుల్లో ఉచితంగా, 564 ప్రైవేట్ ఆసుపత్రుల్లో రుసుము తీసుకుని కొవిడ్ టీకా పంపిణీ చేయనున్నారు. కొవిన్ యాప్లో ముందస్తుగా పేర్లు నమోదు చేసుకున్న వారికే కాకుండా... పంపిణీ కేంద్రాలకు వెళ్లిన వారికి సైతం అక్కడి పరిస్థితులను అనుసరించి టీకా వేస్తారు. వీరందరికీ టీకా వేసేందుకు వీలుగా ‘కొవిన్ 1.0’ యాప్ను ‘కొవిన్ 2.0’గా ఆధునికీకరిస్తున్నారు.
ఈ కారణంగా... శని, ఆదివారాల్లో టీకా పంపిణీ నిలిపివేస్తున్నారు. రాష్ట్రంలో ఇప్పటివరకు రిజిస్ట్రేషన్లు జరిగిన 4 లక్షల మంది ఆరోగ్య సిబ్బందిలో 67% మంది మొదటి డోసు టీకా పొందారు. ఇతర శాఖల ఉద్యోగులు 6 లక్షల మంది ఉంటే వీరిలో 35% మంది వరకు మొదటి డోసు టీకా పొందారు. ఆరోగ్య సిబ్బందిలో 1.40 లక్షల మంది రెండో డోసూ పొందారు. సోమవారం నుంచి కొవిన్ యాప్లో టీకా అవసరమైన వారు పేర్లు నమోదు చేసుకొనే అవకాశాన్ని కల్పించబోతున్నారు.
కొవిన్ యాప్లో వివరాల నమోదు ఇలా..!
*ఈ యాప్లో రాష్ట్రంలోని 2,222 ప్రభుత్వ, ప్రైవేట్ ఆసుపత్రులు, కేంద్ర ప్రభుత్వ ఆసుపత్రుల వివరాలు ఉంటాయి.
*ఆరోగ్యసేతు యాప్ ద్వారా కూడా రిజిస్ట్రేషన్ చేసుకునే అవకాశాన్ని కల్పిస్తారు.
*యాప్లో ఉండే ఆసుపత్రులు, సమయాన్ని అనుసరించి టీకా పొందేందుకు వివరాలు నమోదుచేసుకోవచ్చు.
*పేరు, వయసు, పురుషులు/మహిళలు, పంపిణీ కేంద్రం, సమయాన్ని ఎంచుకోవాలి.
*ఈ వివరాల నమోదు జరిగిన వెంటనే సమయాన్ని (స్లాట్) కేటాయిస్తూ ఫోన్కు సంక్షిప్తసమాచారం వస్తుంది.
నేరుగానూ వెళ్లి వ్యాక్సిన్ పొందొచ్చు..
* కొవిన్ యాప్లో ముందస్తుగా వివరాలు నమోదు చేయకున్నా...టీకా పొందే సౌలభ్యం ఉంది.
* సంబంధిత కేంద్రంలో ఆ రోజు టీకా వేయించుకునే వారు తక్కువ మంది ఉంటే అవకాశం కల్పిస్తారు.
* దీనికి ముందు వివరాల నమోదు తప్పనిసరి.
* టీకా తీసుకోగానే రెండో డోసు ఎప్పుడు వేయించుకోవాలనే సమాచారం వస్తుంది.
* ప్రాధాన్య క్రమంలో తొలి డోసు పొందిన 29 రోజుల నుంచి 42 రోజుల్లోగా రెండో డోసు వేస్తారు.
* ఆయా కేంద్రాల్లో అందుబాటులో ఉన్న టీకాను పంపిణీ చేస్తారు.
రిజిస్ట్రేషన్ జరిగిన వెంటనే స్లిప్పు
వివరాల నమోదు అనంతరం కేంద్రాల్లో రిజిస్ట్రేషన్ స్లిప్ లేదా టోకెన్ ఇవ్వాలని కేంద్ర మార్గదర్శకాలు చెబుతున్నాయి. యాప్లో ‘స్లాట్’ పొందిన సమయాన్ని డౌన్లోడు చేసుకొనే అవకాశాన్నీ కల్పిస్తారు. ఫోన్కు వచ్చిన సంక్షిప్త సమాచారాన్ని పంపిణీ కేంద్రాల్లో చూపించినా టీకా వేస్తారు.
జనవరి 1, 2022ను పరిగణనలోకి...
* 45 ఏళ్లు పైబడి.. దీర్ఘకాలిక వ్యాధులు ఉన్నవారు టీకా పంపిణీ కేంద్రానికి వెళ్లి అక్కడి సిబ్బందికి వైద్యులు ఇచ్చిన ధ్రువీకరణ పత్రం చూపించాలి.
* 60 ఏళ్లు దాటిన వారికి వైద్యుల సర్టిఫికేట్ అవసరం లేదు.
* వయసు గుర్తించేందుకు జనవరి 1, 2022ను ప్రామాణికంగా తీసుకుంటారు.
గుర్తింపు కార్డుల్లో ఏదో ఒకటి తప్పనిసరి!