తెలంగాణలో ఇవాళ మరో 27 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. సంగారెడ్డి జిల్లాలో ఆరు నమోదు కాగా.. ములుగు జిల్లాలో ఇద్దరికి పాజిటివ్ లక్షణాలు వెలుగుచూసినట్లు అధికారులు వెల్లడించారు. మొత్తం బాధితుల సంఖ్య 154కు చేరింది. ఇప్పటివరకు 9మంది కరోనా సోకి చనిపోయారు. ప్రస్తుతం 128 మంది చికిత్స పొందుతున్నారు. ఇప్పటివరకు 17 మంది బాధితులు వైరస్ నుంచి కోలుకున్నారు. పాజిటివ్ కేసులు పెరగడంపై అధికారులు అప్రమత్తమయ్యారు. పాజిటివ్‌గా తేలిన రోగులు.. ఎవరెవరితో కలిసి ఉన్నారన్న వివరాలపై ఆరా తీస్తున్నారు.
తెలంగాణలో 154కు చేరిన కరోనా కేసులు - పెరుగుతున్న కరోనా కేసుల సంఖ్య
తెలంగాణలో ఇవాళ కొత్తగా 27 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో కేసుల సంఖ్య 154కు చేరింది. పాజిటివ్ కేసులు పెరుగుతున్న నేపథ్యంలో అధికారులు అప్రమత్తమయ్యారు.
corona-virus-breaking-news