తెలంగాణలో కొత్తగా 317 కరోనా కేసులు నిర్ధారణ అయ్యాయి. మరో ఇద్దరి మృతితో ఇప్పటివరకు మహమ్మారి బారిన పడి మరణించిన వారి సంఖ్య 1,529కి చేరింది. రాష్ట్రంలో ఇప్పటివరకు 2,84,391 కరోనా కేసులు నమోదయ్యాయి. మరో 536 మంది వైరస్ నుంచి కోలుకోగా... మొత్తం 2,76,244 మంది బాధితులు కరోనా నుంచి విముక్తి పొందారు.
తెలంగాణలో కొత్తగా 317 కరోనా కేసులు... ఇద్దరు మృతి - తెలంగాణ అప్డేట్స్
తెలంగాణలో కొత్తగా 317 కొవిడ్ కేసులు నమోదయ్యాయి. ఇద్దరు మరణించారు. దీంతో ఇప్పటివరకు బాధితుల సంఖ్య 2,84,391కి చేరగా.. 1,529 మంది కరోనా కారణంగా మృతి చెందారు.
కరోనా కేసులు
రాష్ట్రంలో ప్రస్తుతం 6,618 యాక్టివ్ కేసులున్నట్లు వైద్యారోగ్య శాఖ వెల్లడించింది. ప్రస్తుతం హోం ఐసోలేషన్‌లో 4,535 మంది బాధితులున్నట్లు పేర్కొంది. జీహెచ్‌ఎంసీ పరిధిలో కొత్తగా 71 కరోనా కేసులు నమోదయ్యాయి.
ఇదీ చదవండి:కువైట్లో తెలుగుదేశం ప్రవాస బీమా అవగాహన కార్యక్రమం