రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి, ప్రధానమంత్రి మాతృభాషను ఆదరించాలని చెబుతుంటే... రాష్ట్ర సీఎం జగనన్ మాత్రం అమ్మభాషను అంటరాని భాషగా చూడటం దురదృష్టకరమని కాంగ్రెస్ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ తులసిరెడ్డి అన్నారు. స్వాంతంత్య్ర దినోత్సవం సందర్భంగా కూడా సీఎం జగన్ అదే రీతిలో మాట్లాడారని విమర్శించారు.
ప్రజలను మోసం చేశారు...
హోదాపై వైకాపా మాట మార్చిందని....కేవలం కేంద్రాన్ని అడుగుతూనే ఉంటామని చెప్పడం ప్రజలను నమ్మించి మోసం చేయడమేనని వ్యాఖ్యానించారు. హోదా అంశంపై కట్టుబడి ఉంటే...కేంద్రంపై వైకాపాతనఎంపీలతోఅవిశ్వాస తీర్మానం పెట్టించాలని సవాల్ చేశారు. మూడు రాజధానుల పేరుతో రాష్ట్రానికి రాజధాని లేకుండా చేస్తున్నారని మండిపడ్డారు. ప్రపంచంలో ఎక్కడా కూడా ఇలా మూడు రాజధానులు లేవని దుయ్యబట్టారు.
ఇదీ చదవండి
అక్రమ మద్యం కేసులో ఏ-1 నిందితుడిగా భాజపా నేత