ఆర్టీసీలో త్వరలో కారుణ్య నియామకాలను చేపడతామని రవాణాశాఖా మంత్రి పేర్ని వెంకట్రామయ్య(నాని) ప్రకటించారు. కృష్ణా జిల్లా మచిలీపట్నంలోని తన ఇంటికి సోమవారం వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. కారుణ్య నియామకాల కోసం ఎదురుచూస్తున్న విజయవాడ, పామర్రు, మచిలీపట్నం తదితర ప్రాంతాల అభ్యర్థులు తమకు సత్వర న్యాయం చేయాలంటూ మంత్రికి విన్నవించుకున్నారు.
RTC: ఆర్టీసీలో త్వరలో కారుణ్య నియామకాలు - ఆర్టీసీ తాజా వార్తలు
ఆర్టీసీలో త్వరలో కారుణ్య నియామకాలను చేపడతామని రవాణాశాఖా మంత్రి పేర్ని వెంకట్రామయ్య(నాని) ప్రకటించారు. కృష్ణా జిల్లా మచిలీపట్నంలోని తన ఇంటికి సోమవారం వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు.
రాష్ట్రవ్యాప్తంగా 910 మంది ఈ నియామకాల కోసం ఎదురుచూస్తున్నారని వివరించారు. మంత్రి స్పందిస్తూ.. ఆర్టీసీలో పనిచేస్తూ మృతి చెందిన ఉద్యోగుల కుటుంబసభ్యుల్లో ఒకరికి కారుణ్య నియామకం ద్వారా ఉద్యోగం ఇచ్చేందుకు యాజమాన్యం అంగీకరించిందని, సంస్థలో ఆర్థిక సమస్యలు సర్దుబాటు కాగానే నియామకాలు చేపడతామని హామీ ఇచ్చారు. ప్రస్తుతం రాష్ట్రంలో 2016 నుంచి 2020 వరకూ కారుణ్య నియామకాల భర్తీ చేయాల్సి ఉందన్నారు.
ఇదీ చదవండి: ATTACK : మాజీ జడ్పీటీసీ ఇంటిపై దాడి... ఆరు ద్విచక్రవాహనాలు దగ్ధం