అవినీతి నిరోధక శాఖ పనితీరుపై ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అమరావతిలో సమీక్ష నిర్వహించారు. సీఎస్ నీలం సాహ్ని, డీజీపీ గౌతం సవాంగ్, అనిశా చీఫ్ విశ్వజిత్, ఇతర అధికారులు పాల్గొన్నారు. అనిశా పనితీరుపై సీఎం ఆగ్రహం వ్యక్తంచేశారు. ఆశించిన రీతిలో పనితీరు కనిపించట్లేదని అన్నారు. మరింత చురుగ్గా, క్రియాశీలకంగా, అంకిత భావంతో పనిచేయాలని సూచించారు. అనిశా లో పనిచేస్తున్న సిబ్బందికి అలసత్వం ఉండకూడదన్నారు. నెల రోజుల తర్వాత మరోసారి సమీక్ష చేస్తానని వెల్లడించారు.
అనిశాపై సీఎం ఆగ్రహం... అలసత్వం వద్దని హెచ్చరిక - అనిశా పనితీరుపై సీఎం సమీక్ష
అవినీతి నిరోధక శాఖ పనితీరుపై సీఎం జగన్ ఆగ్రహం వ్యక్తంచేశారు. ఉన్నతాధికారులతో సమీక్షలో కీలక వ్యాఖ్యలు చేశారు.
![అనిశాపై సీఎం ఆగ్రహం... అలసత్వం వద్దని హెచ్చరిక cm review on acb department](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-5569156-261-5569156-1577952686199.jpg)
అనిశా పనితీరుపై సీఎం జగన్ సమీక్ష