రాష్ట్ర సంపద పెరగకపోతే పెట్టుబడులు ఎలా వస్తాయని మాజీ ఆర్థిక మంత్రి యనమల రామకృష్ణుడు ప్రభుత్వాన్ని నిలదీశారు. తెలుగుదేశం హయాంలో సంపద సృష్టికి ప్రయత్నం చేశామన్నారు. ప్రస్తుత సర్కారు దాన్ని దెబ్బతీస్తోందని దుయ్యబట్టారు. రాష్ట్రం అభివృద్ధి చెందడం జగన్‌కు ఇష్టం లేదని ఆరోపించారు. అశాంతిని రాజేసేందుకే మూడు రాజధానుల అంశాన్ని తెరపైకి తెచ్చారని మండిపడ్డారు.
పక్కరాష్ట్రాలకు ఆదాయం
తరలింపు పేరుతో తెచ్చిన సమస్యలతో కొత్త సంస్థలు వచ్చే పరిస్థితి లేదని యనమల మండిపడ్డారు. పక్క రాష్ట్రాలకు ఆదాయం చేకూర్చేలా సీఎం జగన్ వ్యవహరిస్తున్నారని విమర్శించారు. ఏడు నెలల పాలనలో రాష్ట్రంలో అభివృద్ధి శూన్యమని... నవరత్నాలు, సంక్షేమ పథకాల అమలులో విఫలమయ్యారుని యనమల ధ్వజమెత్తారు.
ఇదీ చదవండి: