కరోనా బారిన పడిన తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్.. సోమాజిగూడ యశోదా ఆస్పత్రిలో వైద్య పరీక్షలు చేయించుకున్నారు. కేసీఆర్కు సిటీ స్కాన్, సహా ఇతర పరీక్షలు నిర్వహించారు. పరీక్షల అనంతరం ఎర్రవల్లిలోని తన వ్యవసాయ క్షేత్రానికి బయలుదేరారు.
ముఖ్యమంత్రికి సాధారణ పరీక్షలు నిర్వహించాం. సిటీ స్కానింగ్ చేశాం.. నార్మల్గానే ఉంది. కొవిడ్ లక్షణాలు పోయాయి. పూర్తి ఆరోగ్యంగా ఉన్నారు. ఆక్సిజన్ లెవల్స్ బాగానే ఉన్నాయి. - కేసీఆర్ వ్యక్తిగత వైద్యుడు ఎంవీ రావు