ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

తెలంగాణలో కర్ఫ్యూ నుంచి ఆర్టీసీ బస్సులకు మినహాయింపు - telangana cm kcr news

తెలంగాణలో ఆర్టీసీ బస్సులకు కర్ఫ్యూ నిబంధనల నుంచి మినహాయింపు ఇచ్చారు సీఎం కేసీఆర్.​ అయితే సిటీ సర్వీసులకు మాత్రం అనుమతి నిరాకరించారు.

cm-kcr-about-corona-virus-pandemic-in-telangana
cm-kcr-about-corona-virus-pandemic-in-telangana

By

Published : May 27, 2020, 10:50 PM IST

తెలంగాణలో ఆర్టీసీ బస్సులకు కర్ఫ్యూ నిబంధనల నుంచి మినహాయింపు ఇస్తున్నట్లు ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్​ ప్రకటించారు. తెలంగాణ ఆర్థిక పరిస్థితిపై ప్రగతి భవన్‌లో మంత్రులు, ఉన్నతాధికారులతో నిర్వహించిన సమీక్షలో కేసీఆర్ ఈ నిర్ణయం తీసుకున్నారు.

‘‘కర్ఫ్యూ నుంచి ఆర్టీసీ బస్సులకు మినహాయింపు ఇస్తున్నాం. జిల్లాల నుంచి వచ్చే బస్సులు జేబీఎస్‌తో పాటు ఎంజీబీఎస్‌లోనూ ఆగేందుకు అనుమతి ఇస్తాం. హైదరాబాద్‌లో కరోనా కేసులు అధికంగా నమోదవుతుండటంతో మరికొన్నాళ్లు సిటీ సర్వీసులకు అనుమతి ఇవ్వడం లేదు. ఇతర రాష్ట్రాల బస్సులకు రాష్ట్రంలోకి అనుమతి లేదు. ప్రయాణ ప్రాంగణాల్లో ట్యాక్సీలు, ఆటోలు తదితర రవాణా వాహనాలను అనుమతిస్తారు. టికెట్ కలిగిన ప్రయాణీకులు కర్ఫ్యూ సమయంలోనూ ప్రైవేటు వాహనాల్లో తమ ఇళ్లకు వెళ్లవచ్చు’’ అని కేసీఆర్‌ తెలిపారు. మరోవైపు మే నెలలోనూ ప్రజాప్రతినిధులు, ఉద్యోగుల వేతనాల్లో కోత విధించనున్నట్లు సీఎం కేసీఆర్‌ స్పష్టం చేశారు.

ABOUT THE AUTHOR

...view details