పవిత్ర రంజాన్ మాసం సందర్భంగా.. రాష్ట్రంలోని ముస్లింలకు సీఎం జగన్ ట్విట్టర్ వేదికగా శుభాకాంక్షలు తెలిపారు. నెలపాటు నియమనిష్ఠలతో కఠిన ఉపవాస వ్రతం ఆచరిస్తూ.. ఈ పుణ్యమాసాన్ని ముస్లిం సోదరులంతా జరుపుకుంటారన్నారు. వారికి అల్లాహ్ దీవెనలు లభించాలని ఆయన ఆకాంక్షించారు.
ఇదీ చదవండి:ఇండో పసిఫిక్‌పై భారత్, ఫ్రాన్స్ చర్చలు
మహనీయుడైన మహ్మద్ ప్రవక్త ద్వారా దివ్య ఖురాన్ ఆవిర్భవించింది రంజాన్ మాసంలోనే కావడంతో.. ముస్లింలు ఈ నెలకు అత్యంత ప్రాముఖ్యతనిస్తారని సీఎం అన్నారు. రంజాన్ అంటే ఉపవాసాలు మాత్రమే కాదని.. మనిషిలోని చెడు భావాల్ని, అధర్మాన్ని, ద్వేషాన్ని రూపుమాపే గొప్ప దీక్ష అని తెలిపారు.
ఇదీ చదవండి:
'కుమార్తెను చదివించాలి.. కిడ్నీలు అమ్ముకునేందుకు అనుమతివ్వండి'