స్పందన వినతుల పరిష్కారానికి ప్రత్యేక కార్యాచరణ: సీఎం
స్పందన కార్యక్రమంపై ముఖ్యమంత్రి జగన్ సమీక్ష నిర్వహించారు. వినతుల పరిష్కారానికి ప్రత్యేక కార్యాచరణ సిద్ధం చేశామని తెలిపారు. ఈ నెల 24, 27 తేదీల్లో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఆధ్వర్యంలో రాష్ట్ర స్థాయి కార్యశాల ఏర్పాటు చేస్తున్నామని పేర్కొన్నారు.
'స్పందన' కార్యక్రమంపై సీఎం జగన్ సమీక్ష నిర్వహించారు. వినతుల పరిష్కారానికి ప్రత్యేక కార్యాచరణ రూపొందించామని తెలిపారు. తహశీల్దార్లు, ఎంపీడీవోలు, మున్సిపల్ కమిషనర్లకు కార్యశాలలు ఏర్పాటు చేశామని ముఖ్యమంత్రి తెలిపారు. సమస్యలు తీరుస్తామనే ఆశతోనే ప్రజలు మన వద్దకు వస్తారని సీఎం వ్యాఖ్యానించారు. ఈ సందర్భంగా అధికారులకు పలు సూచనలు చేశారు. వినతులు ఇచ్చేవారి స్థానంలో ఉండి అధికారులు ఆలోచించాలని తెలిపారు. స్పందన ఫిర్యాదులను మానవీయ దృక్పథంతో పరిష్కరించాలని సూచించారు. ఈ నెల 24, 27 తేదీల్లో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఆధ్వర్యంలో రాష్ట్రస్థాయి కార్యశాల ఏర్పాటు చేస్తున్నామని పేర్కొన్నారు. అక్టోబరులో జిల్లా స్థాయిలో రెండ్రోజుల పాటు కార్యశాలలు ఉంటాయని వెల్లడించారు. దిగువ స్థాయి అధికారులకు మరింత ప్రేరణ కల్గించటమే దీని ఉద్దేశమని స్పష్టం చేశారు.