సచివాలయంలో సీఎం జగన్మోహన్ రెడ్డి సమీక్షలు కొనసాగుతున్నాయి. ఇసుక పాలసీపై సమీక్ష నిర్వహించిన అనంతరం స్పందన కార్యక్రమంపై కలెక్టర్లు, ఎస్పీలతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు.
ఇసుక యార్డుల సంఖ్య పెంచండి.. అధికారులకు సీఎం ఆదేశం
సచివాలయంలో నూతన ఇసుక విధానంపై సమీక్ష చేపట్టారు. రాష్ట్రంలో ఇసుక కొరత లేకుండా స్టాక్ యార్డ్ల సంఖ్యను పెంచాలని ఆదేశించారు. వరద తగ్గగానే ఇసుకను రీచ్ నుంచి స్టాక్ పాయింట్ల దగ్గరకు చేర్చాలని అధికారులకు సూచించారు.
ఏ స్థాయిలోనూ అవినీతి జరగకూడదు
ఇసుక విధానంపై సమీక్ష చేపట్టిన సీఎం జగన్...అధికారులకు పలు సూచనలు చేశారు. వరద తగ్గగానే ఇసుకను రీచ్ నుంచి స్టాక్ యార్డులకు చేర్చాలని సూచించారు. స్టాక్ యార్డ్ల సంఖ్య మరిన్ని పెంచాలని తెలిపారు. ఇసుక మాఫియాకు అవకాశం లేకుండా సాంకేతిక సహకారం తీసుకోవాలి పేర్కొన్నారు. ఏ స్థాయిలోనూ అవినీతి జరగకూడదని స్పష్టం చేశారు. అక్రమ రవాణాను అడ్డుకునేందుకు చెక్ పోస్టుల వద్ద సీసీ కెమెరాలు పెట్లాలని ఆదేశించారు. పుటేజిని మానిటరింగ్ చేసే వ్యవస్థ కూడా ఉండాలని అన్నారు. బల్క్ యూజర్ల కోసం ప్రత్యేక స్టాక్ యార్డులు ఏర్పాటు చేయాలని అధికారులను ఆదేశించారు.