పులివెందుల మోడల్ టౌన్‌పై... క్యాంపు కార్యాలయంలో సీఎం జగన్ సమీక్ష నిర్వహించారు. సమీక్షకు మంత్రి బొత్స సత్యనారాయణ, ఎంపీ అవినాష్‌రెడ్డి, ఉన్నతాధికారులు హాజరయ్యారు. పులివెందుల ప్రాంత అభివృద్ధి సంస్థ (పాడా)పై.. సీఎం పలు విషయాలను చర్చించారు. పాఠశాలలు, ఆస్పత్రులను నిర్దిష్ట నమూనాలకు అనుగుణంగా నిర్మించాలని అధికారులను ఆదేశించారు. మనం నిర్మించే భవనాలు ఏళ్లు గడుస్తున్నా చెక్కుచెదరకుండా ఉండాలంటూ ముఖ్యమంత్రి సూచించారు. పులివెందులలోని మెయిన్ రోడ్డును మార్పు చేయడానికి ప్రాధాన్యత ఇవ్వాలని అన్నారు.
పులివెందుల మోడల్ టౌన్‌పై సీఎం సమీక్ష - సీఎం జగన్ తాజా వార్తలు
తాడేపల్లి క్యాంపు కార్యాలయంలో సీఎం జగన్ సమీక్ష నిర్వహించారు. పులివెందుల మోడల్ టౌన్‌పై మంత్రులు, అధికారులతో చర్చించారు.
పులివెందుల మోడల్ టౌన్‌పై సీఎం సమీక్ష