కడప స్టీల్ ప్లాంటుపై ముఖ్యమంత్రి జగన్.. తాడేపల్లిలో సమీక్ష నిర్వహించారు. టౌన్‌షిప్, దానికి అనుబంధంగా మౌలిక వసతులను రెండేళ్లలో కల్పించేలా చర్యలు తీసుకోవాలని ఈ సందర్భంగా అధికారులకు నిర్దేశించారు. హ్యుందయ్, టాటా స్టీల్స్, ఎస్సార్ స్టీల్ సహా పలు కంపెనీలతో ఇప్పటివరకు జరిపిన చర్చల వివరాలను ముఖ్యమంత్రికి అధికారులు తెలియజేశారు. ఎంపిక చేసే భాగస్వామ్య సంస్థలతో 2 నెలల్లో ఒప్పందం చేసుకునేలా చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. ఈ సమీక్షలో మంత్రి గౌతమ్‌రెడ్డి, ప్రత్యేక ప్రధాన కార్యదర్శి కరికాల వలవన్ తదితరులు పాల్గొన్నారు.
- పట్టాల పంపిణీలో అవినీతి ఉండొద్దు: సీఎం
అటవీ హక్కుల పరిరక్షణ చట్టం (ఆర్వోఎఫ్‌ఆర్) కింద భూములపై హక్కుల కోసం వచ్చిన ప్రతి దరఖాస్తునూ మరోసారి పరిశీలించాలని సీఎం జగన్ ఆదేశించారు. భూములపై హక్కులు కల్పించే విషయంలో అవినీతి ఉండకూడదని స్పష్టం చేశారు. ప్రపంచ ఆదివాసి దినోత్సవం నాటికి గిరిజనులకు పట్టాలివ్వాలని సూచించారు. తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయంలో సోమవారం ఆర్వోఎఫ్‌ఆర్ పట్టాల పంపిణీపై సీఎం సమీక్షించారు.