ఆంధ్రప్రదేశ్

andhra pradesh

By

Published : Dec 21, 2019, 7:57 AM IST

ETV Bharat / city

'గోదావరి టు పెన్నా... వయా కృష్ణా'

గోదావరి వరద జలాలను... కర్నూలు జిల్లా బనకచర్లకు తరలించడమే లక్ష్యంగా ప్రాజెక్టులు చేపట్టాలని సీఎం జగన్ అధికారులను ఆదేశించారు. గోదావరి నుంచి కృష్ణా నదిలోకి, అక్కడి నుంచి ప్రతిపాదిత బొల్లాపల్లి రిజర్వాయర్‌కు, అక్కడి నుంచి బనకచర్ల హెడ్‌ రెగ్యులేటర్‌ ద్వారా పెన్నా బేసిన్‌కు నీళ్లు తరలించనున్నట్లు సీఎం జగన్ వివరించారు.

cm jagan review on irrigation and nadu nedu
నదీ జలాల తరలింపుపై సమీక్షించిన సీఎం జగన్

నదీ జలాల తరలింపుపై సమీక్షించిన సీఎం జగన్

రోజుకు 2 టీఎంసీల గోదావరి వరద జలాలను... కర్నూలు జిల్లా బనకచర్లకు తరలించడమే లక్ష్యంగా ప్రాజెక్టులు చేపట్టాలని ముఖ్యమంత్రి జగన్​మోహన్ రెడ్డి అధికారులను ఆదేశించారు. సీజన్‌కు 200 టీఎంసీల నీరు తీసుకెళ్లాలని నిర్దేశించారు. నదీ జలాల తరలింపుపై సమీక్షించిన సీఎం జగన్... జనవరి నెలాఖరు వరకు డీపీఆర్ సిద్ధం చేయాలని సూచించారు.

గోదావరి నుంచి కృష్ణా నదిలోకి, అక్కడి నుంచి ప్రతిపాదిత బొల్లాపల్లి రిజర్వాయర్‌కు, అక్కడి నుంచి బనకచర్ల హెడ్‌ రెగ్యులేటర్‌ ద్వారా పెన్నా బేసిన్‌కు నీళ్లు తరలించనున్నట్లు సీఎం జగన్ వివరించారు. పోలవరం కుడి కాల్వ సామర్థ్యం పెంపు, అక్కడి నుంచి కృష్ణా నదిలోకి, నాగార్జునసాగర్‌ కుడి ప్రధాన కాల్వ ద్వారా బొల్లాపల్లికి తరలించాలని అధికారులకు చెప్పారు. ఈ సందర్భంగా వాప్కోస్‌ ప్రతినిధులు తమ ప్రతిపాదనలపై ముఖ్యమంత్రికి వివరణ ఇచ్చారు.

ఆస్పత్రుల్లో సమస్యల పరిష్కరించండి...
రాష్ట్రవ్యాప్తంగా ఉన్న ప్రభుత్వ ఆస్పత్రుల్లో సమస్యల పరిష్కారం సహా... మౌలిక వసతుల అభివృద్ధిని వేగంగా పూర్తి చేయాలని సీఎం జగన్ అధికారులను ఆదేశించారు. 'నాడు-నేడు' కింద చేపట్టే పనులు నాణ్యంగా ఉండాలని నిర్దేశించారు. జనవరి నుంచి కొత్త ఆరోగ్యశ్రీ కార్డుల జారీ సహా వివిధ రకాల వ్యాధులతో బాధపడుతున్నవారికి పెన్షన్ ఇవ్వాలని ఆదేశించారు. రాష్ట్రవ్యాప్తంగా ప్రభుత్వ ఆస్పత్రుల్లో ఖాళీగా ఉన్న వైద్యులు, సహా సిబ్బందిని భర్తీ చేయాలని సీఎం ఆదేశించారు.

ఇదీ చదవండీ...

'జీఎన్ రావు కమిటీ నివేదిక మాకు సమ్మతమే'

ABOUT THE AUTHOR

...view details