రాష్ట్ర ప్రజలకు, ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగు ప్రజలకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్ దీపావళి శుభాకాంక్షలు తెలియచేశారు. ఈ దీపావళి ప్రజల జీవితాల్లో కోటి కాంతులు నింపాలని ప్రతీ ఇంటా ఆనంద దీపాలు వెలగాలని భగవంతుడ్ని కోరుకుంటున్నానంటూ సీఎం ట్వీట్ చేశారు.
వారు దేశానికి వెలకట్టలేని ఆస్తి
మరోవైపు బాలల దినోత్సవం సందర్భంగానూ.... చిన్నారులకు శుభాకాంక్షలు తెలిపారు. చిన్నారులే దేశానికి వెలకట్టలేని ఆస్తి అంటూ పేర్కోన్నారు. చిన్నారులకు ఇవ్వగలిగిన మంచి బహుమతి చదువు ఒక్కటేనని సీఎం ట్వీట్లో పేర్కోన్నారు. అందుకే ఏపీ ప్రభుత్వం చిన్నారుల మంచి భవిష్యత్తు కోసం ఉత్తమ ప్రమాణాలతో విద్యను అందించాలని నిర్ణయించిందని ముఖ్యమంత్రి తెలిపారు.
ఇదీ చదవండి:
తెలుగు ప్రజలకు చంద్రబాబు, లోకేశ్ శుభాకాంక్షలు