కౌలుదారీ చట్టంలో మార్పులు తీసుకొచ్చి కౌలు రైతులను ఆదుకుంటామని సీఎం జగన్ అన్నారు. ధరల స్థిరీకరణ నిధి ద్వారా రైతుల పంటలను కొనుగోలు చేశామని చెప్పారు. రైతులకు పగటిపూట 9 గంటలపాటు ఉచిత విద్యుత్ సరఫరా చేస్తున్నామని గుర్తు చేశారు. ఖరీఫ్ నాటికి 82 శాతం ఫీడర్లు సిద్ధంగా ఉన్నాయని....మిగిలిన 18 శాతం ఫీడర్లు కూడా సిద్ధమవుతున్నాయని వెల్లడించారు. ఆత్మహత్య చేసుకున్న రైతు కుటుంబాలకు అండగా ఉన్నామన్న ఆయన...434 మంది రైతు కుటుంబాలకు రూ. 5లక్షల పరిహారం ఇవ్వగలిగామని చెప్పారు.
సాగు, మార్కెటింగ్, ఫుడ్ ప్రాసెసింగ్‌లో మార్పులు తీసుకురాబోతున్నాం. రైతులకు వ్యవసాయ బోర్డులు ఏర్పాటు చేస్తున్నాం. వచ్చే ఏడాది చివరికల్లా ప్రతి గ్రామ సచివాలయం పక్కన వైఎస్‌ఆర్ జనతా బజార్లు ఏర్పాటు చేస్తాం. రైతులు పండించే అన్ని పంటల విక్రయాలు అక్కడే జరుపుతాం- సీఎం జగన్