Ramineni Foundation Awards: తెలంగాణలోని హైదరాబాద్‌లో రామినేని ఫౌండేషన్ పురస్కార ప్రదాన కార్యక్రమం ఘనంగా జరిగింది. వివిధ రంగాల్లో విశేష ప్రతిభ, మానవీయత చాటుకున్న వ్యక్తులకు అవార్డులు అందించారు. సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. 2020 సంవత్సరానికి గాను... నాబార్డు ఛైర్మన్ చింతల గోవిందరాజు.. రామినేని విశిష్ట పురస్కారం అందుకున్నారు. విశేష పురస్కారాల కేటగిరీలో యాంకర్ సుమ, డా.మస్తాన్ యాదవ్, బండ్లమూడి శ్రీనివాస్ అందుకున్నారు. హాస్యనటుడు బ్రహ్మానందం, నిమ్స్ వైద్యురాలు దుర్గా పద్మజ, సినీ పాత్రికేయులు ఎస్వీ రామారావులకు విశేష పురస్కారాలు అందజేశారు. 2021 సంవత్సరానికిగాను విశిష్ట పురస్కారాలను కృష్ణ ఎల్ల దంపతులకు సీజేఐ జస్టిస్ ఎన్వీ రమణ ప్రదానం చేశారు.
మూలాలు మరవకూడదు..
CJI Justice NV Ramana: మనం ఎంత ఎదిగినా మూలాలు మరవకూడదని... మన భాష, సంస్కృతి ఔన్నత్యమే మనకు గౌరవమని సీజేఐ జస్టిస్ ఎన్వీ రమణ అన్నారు. పిల్లలకు తెలుగు భాష, సాహిత్యాన్ని అలవర్చాలని సూచించారు. తెలుగువారిని గౌరవిస్తున్న రామినేని ఫౌండేషన్ సేవలను అభినందించారు. అవార్డు గ్రహీతలందరూ వారి జీవితంలో ఎన్నో కష్టాలకోర్చి, కఠోర శ్రమతో ఈ స్థాయికి ఎదిగారని కొనియాడారు. కొవాగ్జిన్ ద్వారా తెలుగువారి ఘనకీర్తిని ప్రపంచానికి చాటిన కృష్ణ ఎల్ల దంపతులను జస్టిస్ ఎన్వీ రమణ అభినందించారు.
భారత్ నాయకత్వం వహిస్తుండటం గర్వకారణం..
Bharat Biotech md: టీకాల తయారీలో ప్రపంచానికి... భారత్ నాయకత్వం వహిస్తుండటం గర్వకారణమని భారత్ బయోటెక్ వ్యవస్థాపక ఛైర్మన్, ఎండీ కృష్ణ ఎల్ల అన్నారు. దేశం మనకేం ఇచ్చిందని ఆలోచించడం కంటే దేశానికి మనం ఏం ఇవ్వగలమనే ఆలోచనతో ముందుకు సాగాలన్నారు. కొవాగ్జిన్ విజయం భారత్ బయోటెక్ ఉద్యోగుల కృషి ఫలితమేనని... సంస్థ జాయింట్ మేనేజింగ్ డైరెక్టర్ సుచిత్ర ఎల్ల చెప్పారు. రామినేని విశిష్ట పురస్కారం సమష్టి కృషికి అంకితమని కృష్ణ ఎల్ల దంపతులు పేర్కొన్నారు.
దేశం దన్నుగా నిలబడాలి