ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

'ప్రజల భూములు కొట్టేయాలనే... విశాఖలో రాజధాని' - మందడంలో చంద్రబాబు

తెదేపా అధినేత చంద్రబాబు, ఆయన సతీమణి భువనేశ్వరి మందడం రైతుల ధర్నాలో పాల్గొన్నారు. ఈ ధర్నాకు వెలగపూడి, మల్కాపురం, వెంకటపాలెం, పరిసర గ్రామాల నుంచి రైతులు పెద్దఎత్తున హాజరయ్యారు.

చంద్రబాబు
చంద్రబాబు

By

Published : Jan 1, 2020, 8:04 PM IST

మందడంలో రైతుల దీక్షకు చంద్రబాబు మద్దతు

హైదరాబాద్​లాంటి నగరం మనకూ కావాలని ఆలోచించే అమరావతికి శ్రీకారం చుట్టామని తెదేపా అధినేత చంద్రబాబు స్పష్టం చేశారు. రాష్ట్రానికి మధ్యలో ఉంటుందనే అమరావతిని ఎంపిక చేశామని.. దానికి ప్రజలు ఒప్పుకున్నారని తెలిపారు. రాజధానికి 30 వేల ఎకరాలు కావాలని జగనే చెప్పారని.. ఆనాడు ఒప్పుకుని ఇప్పుడెందుకు యు-టర్న్ తీసుకున్నారని ప్రశ్నించారు.

జగనంత పిరికివాడిని ఎప్పుడూ చూడలేదు..
జగన్‌లాంటి పిరికి వ్యక్తిని ఎప్పుడూ చూడలేదని.. ముందు డమ్మీ కాన్వాయ్‌ను పంపి తర్వాత జగన్ వస్తున్నారని ఎద్దేవా చేశారు. పోలీసులు తమ బాధ్యతలు గుర్తెరిగి ప్రవర్తించాలన్నారు. ఆందోళన చేస్తున్న రైతులను పెయిడ్ ఆర్టిస్టులంటూ అవమానిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. వైకాపా ప్రభుత్వం వచ్చిన ఈ 7 నెలల్లో ఒక్క మంచి పని జరిగిందా అని చంద్రబాబు ప్రశ్నించారు.

విశాఖ ప్రజలనూ మోసం చేసేందుకే..
విశాఖ ప్రజల ఆస్తులు కొట్టేయాలని మూడు రాజధానుల నాటకం ఆడుతున్నారని తెదేపా అధినేత ధ్వజమెత్తారు. అమరావతిలో పైసా ఖర్చు పెట్టాల్సిన అవసరం లేదని.. 7 నెలలుగా అన్ని పనులూ అమరావతిలోనే చేస్తున్నారన్నారు. రాజధానిపై ఇంకా ఎన్ని కమిటీలు వేస్తారని ప్రశ్నించారు. అమరావతి జోలికొస్తే కాలిపోతారని హెచ్చరించారు.

ఇవీ చదవండి..

29 గ్రామాల కోసం కాదు.. 5 కోట్ల మంది ఆంధ్రుల కోసం..!'

ABOUT THE AUTHOR

...view details