ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

'సర్దార్ గౌతు లచ్చన్న పోరాటం ఎందరికో ఆదర్శం' - సర్దార్ గౌతు లచ్చన్న వర్థంతి

బడుగు బలహీన వర్గాల కోసం సర్దార్ గౌతు లచ్చన్న చేసిన పోరాటం చరిత్రలో నిలిచిపోతుందని.. తెదేపా అధినేత చంద్రబాబు అన్నారు. ఆయన వర్థంతి సందర్భంగా చంద్రబాబు, లోకేశ్​లు నివాళులర్పించారు.

chandrababu lokesh tribute to sardar gouthu lachhana
సర్దార్ గౌతు లచ్చన్నకు చంద్రబాబు, లోకేశ్ నివాళులు

By

Published : Apr 19, 2020, 3:53 PM IST

సర్దార్ గౌతు లచ్చన్న వర్ధంతి సందర్భంగా తెలుగుదేశం అధినేత చంద్రబాబు, తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ నివాళులు అర్పించారు. రైతులు, వెనుకబడిన వారి సంక్షేమం కోసం గౌతు లచ్చన్న చేసిన పోరాటం మర్చిపోలేనిదని చంద్రబాబు వ్యాఖ్యానించారు. స్వాతంత్య్ర సమరయోధుడిగా, సామాజిక వేత్తగా ఆయన నాయకత్వం భవిష్యత్తు తరాలకు స్ఫూర్తినిస్తుందని కొనియాడారు. సమాజంలో మార్పు కోసం గౌతు లచ్చన్న అలుపెరగని పోరాటం చేశారని లోకేశ్ అన్నారు.

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details