తమిళనాడు సీఎం పళనిసామి, కేంద్ర హోం శాఖ కార్యదర్శి అజయ్‌కుమార్ భల్లాకు తెదేపా అధినేత చంద్రబాబు లేఖ రాశారు. తమిళనాడులో చిక్కుకున్న ఉత్తరాంధ్ర, ప్రకాశం జిల్లాలకు చెందిన 1500 మంది భవన నిర్మాణ కార్మికులను ఆదుకోవాలని విజ్ఞప్తి చేశారు. లాక్‌డౌన్ మే 3 వరకు పొడిగించినందున వారికి నిత్యావసరాలను అందించాలని సూచించారు. కూలీలందరూ చెన్నై, తమిళనాడు చుట్టుపక్కల ఉన్నారని లేఖలో పేర్కొన్నారు. వారి యోగక్షేమాలపై కుటుంబసభ్యులు ఆందోళనతో ఉన్నారని చెప్పారు. తమిళనాడులో చిక్కుకున్నవారికి సంబంధించిన ఫోన్ నెంబర్లు, వివరాలను చంద్రబాబు జత చేశారు.
'తమిళనాడులో చిక్కుకున్న కార్మికులను ఆదుకోండి' - chandra babu letter to tamilnadu cm
తమిళనాడులో చిక్కుకున్న 1500 మంది రాష్ట్ర భవన నిర్మాణ కార్మికులను ఆదుకోవాలని ఆ రాష్ట్ర సీఎం పళనిసామి, కేంద్ర హోంశాఖ కార్యదర్శి అజయ్‌కుమార్ ను తెదేపా అధినేత చంద్రబాబు కోరారు. ఈ మేరకు వారికి లేఖలు పంపించారు.
'తమిళనాడులో చిక్కుకున్న కార్మికులను ఆదుకోండి'