ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

స్థానిక ఎన్నికలకు మళ్లీ నోటిఫికేషన్ ఇవ్వాలి: చంద్రబాబు - వైసీపీ చంద్రబాబు కామెంట్స్

స్థానిక ఎన్నికలకు మళ్లీ నోటిఫికేషన్ ఇవ్వాలని..., ఇక్కడి పోలీసులకు నిర్వహణ సత్తా లేనందున... కేంద్ర బలగాల మోహరింపుతో ఎన్నికలు నిర్వహించాలని తెలుగుదేశం అధినేత చంద్రబాబు డిమాండ్‌ చేశారు. రాష్ట్రవ్యాప్తంగా పులివెందుల రాజకీయంతో అభ్యర్థుల చేత బలవంతంగా నామినేషన్లు ఉపసంహరించారని ఆరోపించారు. ఎన్నికల కమిషనర్‌ రమేశ్‌కుమార్‌ను తాను నియమించాననడంలో ఏమాత్రం వాస్తవం లేదని... గతంలో సీఆర్​ బిశ్వా అనే అధికారిని కోరితే... అప్పటి గవర్నర్‌ నరసింహన్‌ రమేశ్‌ను నియమించారని గుర్తుచేశారు.

స్థానిక ఎన్నికలకు మళ్లీ నోటిఫికేషన్ ఇవ్వాలి: చంద్రబాబు
స్థానిక ఎన్నికలకు మళ్లీ నోటిఫికేషన్ ఇవ్వాలి: చంద్రబాబు

By

Published : Mar 15, 2020, 7:43 PM IST

స్థానిక ఎన్నికలకు మళ్లీ నోటిఫికేషన్ ఇవ్వాలి: చంద్రబాబు

కేంద్ర ఎన్నికల సంఘం ఆధ్వర్యంలో ఎన్నికలు జరపాలని చంద్రబాబు కోరారు. కేంద్ర బలగాలను మోహరించి నిర్వహించాలన్నారు. ఇప్పటివరకు జరిగిన ఏకగ్రీవాలను రద్దు చేయాలన్న చంద్రబాబు.. విపత్తుల వేళ ఎన్నికలు వాయిదా వేయటం గతంలోనూ జరిగిందని గుర్తు చేశారు. తాత్కాలిక పదవి చూసుకుని జగన్ విర్రవీగిపోతున్నారని మండిపడ్డారు. పంచాయతీ మంత్రి తన పదవికి సరిపోరని విమర్శించారు. పోలీసులను అడ్డుపెట్టుకుని అక్రమ కేసులు పెడుతున్నారన్న చంద్రబాబు.. తెదేపా నేతల ఇళ్లకు తెల్లవారుజామునే వెళ్లి బెదిరించారని ఆరోపించారు.

'111 మంది తెదేపా అభ్యర్థుల నామినేషన్లను తిరస్కరించారు. పులివెందుల రాజకీయాన్ని రాష్ట్రం మొత్తం చేస్తానంటే ఊరుకోను. నేను అధికారంలో ఉన్నప్పుడు ఇలాగే చేసి ఉంటే వైకాపా పరిస్థితి ఎలా ఉండేది. వైకాపా శ్రేణుల అక్రమాలకు సంబంధించి మా వద్ద ఆధారాలు ఉన్నాయి. ఎన్నికల నిష్పక్షపాతంగా నిర్వహిస్తే మేం సహకరిస్తాం. జగన్‌లాంటి వ్యక్తి రాజకీయాల్లో ఉండటం దేశానికి శాపం. ఎంతటివారైనా రాజ్యాంగానికి లోబడి పనిచేయాల్సిందే'. అని చంద్రబాబు హితవు పలికారు.

ఇదీ చదవండి: మనుషుల ప్రాణాల కంటే ఎన్నికలు ముఖ్యమా ?: చంద్రబాబు

ABOUT THE AUTHOR

...view details