కరోనా వైరస్ వ్యాప్తి నివారణకు ప్రతి ఒక్కరూ బాధ్యతాయుతంగా మెలగాలని తెలుగుదేశం అధినేత చంద్రబాబు పిలుపునిచ్చారు. ప్రతి ఒక్కరూ... వైద్యులు సూచించిన ఐదు దశలను పాటించాలని చెప్పారు. వ్యక్తిగత పరిశుభ్రత పాటించాలని చంద్రబాబు సూచించారు. విదేశాల నుంచి వచ్చిన వారిని ప్రభుత్వం ఆలస్యంగా క్వారంటైన్ చేసిందని, ముందే చేసుంటే తీవ్రత పెరిగేది కాదని తెలిపారు. కరోనా వైరస్ కట్టడి చేయగలిగితే దేశ ఖ్యాతి మరింత పెరుగుతుందని చెప్పారు.
'ప్రతి ఒక్కరూ బాధ్యతాయుతంగా మెలగాలి' - తెదేపా అధినేత చంద్రబాబు వార్తలు
ప్రతి ఒక్కరూ బాధ్యతాయుతంగా మెలగాలని తెదేపా అధినేత చంద్రబాబు పిలుపునిచ్చారు. ప్రతి ఒక్కరూ ఐదు దశలను పాటించాలని సూచించారు. వ్యక్తిగత పరిశుభ్రతను అందరూ పాటించాలన్నారు. ప్రతి ఒక్కరూ సామాజిక బాధ్యతగా గుర్తించాలని పేర్కొన్నారు.

chandrababu comments on corona
Last Updated : Mar 24, 2020, 5:20 PM IST