ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

కథ అడ్డం తిరిగింది.. కటకటాల పాలయ్యారు

CHAIN SNATCHING: ఆ ఇద్దరు దొంగలు ప్లాన్ చేశారు. రోడ్డుపై పహారా కాశారు. అంతలోనే ఓ మహిళ అటువైపు రావడం గమనించారు. ఆమె మెడలోని బంగారు గొలుసును చూసి ఈరోజు పంట పండిందనుకున్నారు. అనుకున్నదే తడువుగా ప్లాన్​ను ఆచరణలోకి పెట్టారు. ఆ మహిళ మెడలోని నుంచి బంగారు గొలుసును లాక్కున్నారు. కానీ అంతలోనే కథ కాస్త అడ్డం తిరిగింది. తానోకటి తలిస్తే దైవమొకటి తలించింది. అసలేం జరిగిదంటే..

చైన్ స్నాచర్లు
చైన్ స్నాచర్లు

By

Published : May 6, 2022, 5:32 PM IST

కథ అడ్డం తిరిగింది.. కటకటాల పాలయ్యారు

CHAIN SNATCHING: హైదరాబాద్​లో రెండు రోజుల వ్యవధిలోనే చైన్ స్నాచర్లు రెచ్చిపోయారు. వనస్థలిపురంలో రహదారిపై వెళ్తున్న రమణమ్మ అనే వృద్ధురాలిని లక్ష్యంగా చేసుకొని గొలుసు దొంగతనానికి పాల్పడ్డారు. కానీ అంతలోనే కథ అడ్డం తిరిగింది. నిందితులు ప్రయాణిస్తున్న ద్విచక్ర వాహనం లారీని ఢీ కొట్టింది. దీంతో స్ధానికులు అప్రమత్తమై దొంగలను పట్టుకున్నారు. ఈ క్రమంలో ఒకరిని పట్టుకొని వనస్థలిపురం పోలీసులకు అప్పగించారు. మరో నిందితుడు పరారీలో ఉన్నాడని పోలీసులు తెలిపారు.

రెండు రోజుల క్రితం కూడా నగరంలో చైన్ స్నాచింగ్ జరిగింది. పేట్ బషీర్​బాద్​​లోని జయరాం నగర్​కు చెందిన రమాదేవి కుమారుడితో కలిసి ఉదయం వాకింగ్ చేస్తున్నారు. వెనుక నుంచి వచ్చిన దుండగుడు ఆమె మెడలోనుంచి బంగారు గొలుసును లాకెళ్లాడు.

పట్టుబడిన నిందితుడు

ABOUT THE AUTHOR

...view details