భారత్‌లో కరోనా వైరస్ ప్రభావం పెద్దగా లేదని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి జి.కిషన్‌రెడ్డి అన్నారు. ఇప్పటివరకూ దేశంలో ఎలాంటి కరోనా మరణాలు సంభవించలేదని, ప్రజలు చాలా ధైర్యంగా ఉన్నారని చెప్పారు. చైనాలో కరోనా వైరస్ ప్రబలిన నేపథ్యంలో భారత్‌లో పరిస్థితులను సమీక్షించి.. ఎప్పటికప్పుడు చర్యలు తీసుకోవడానికి ప్రధానమంత్రి మోదీ ఏర్పాటు చేసిన మంత్రుల టాస్క్‌ఫోర్స్‌లో సభ్యుడిగా ఉన్న జి.కిషన్‌రెడ్డి తాజా స్థితిగతులపై ‘ఈటీవీ భారత్’తో ప్రత్యేకంగా మాట్లాడారు.
1. కరోనా వైరస్‌పై కేంద్రప్రభుత్వ పరంగా ఏం చర్యలు తీసుకుంటున్నారు?
మన దేశం నుంచి వేలాదిమంది వ్యాపారులు రోజూ చైనాకు వెళ్లివస్తుంటారు. వైద్య విద్య కోసం వెళ్లిన ఎంతో మంది విద్యార్థులు అక్కడ ఉంటున్నారు. వీరి సౌకర్యార్థం భారత రాయబార కార్యాలయం 24 గంటలూ అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకున్నాం. చైనాకు సరిహద్దు దేశీయులైన మనం మరింత జాగ్రత్తగా ఉండాలన్న ఉద్దేశంతో.. మంత్రులు, అధికారులతో ప్రధానమంత్రి వేర్వేరు టాస్క్‌ఫోర్స్‌లు ఏర్పాటు చేశారు. ఎప్పటికప్పుడు రాష్ట్రాల వైద్యశాఖ మంత్రులు, అధికారులతో చర్చించి అక్కడ ఎలాంటి చర్యలు తీసుకుంటున్నదీ విశ్లేషిస్తున్నాం. ఏం చేయాలో చెబుతున్నాం.
2. చైనా నుంచి వచ్చిన వారి పట్ల ఎలా వ్యవహరిస్తున్నారు?
చైనా నుంచి మనవాళ్లు ఇప్పటికి వెయ్యి మందికిపైగా వచ్చారు. వారిని ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు ఏర్పాటుచేసిన పర్యవేక్షణ కేంద్రాల్లోనే ఉంచి పరీక్షించమని చెప్పాం. రాష్ట్రాల్లో ఏర్పాటుచేసిన పర్యవేక్షణ శిబిరాల పనితీరు, సౌకర్యాలు, మందుల లభ్యతను పరిశీలించడానికి కేంద్రం అన్ని రాష్ట్రాలకూ అధికారులను పంపింది. కరోనా వైరస్‌కు మన భారతీయ సంప్రదాయ వైద్య విధానాల్లో ఏదైనా పరిష్కారం ఉందేమో కనుక్కోమని ఆయుష్ డిపార్ట్‌మెంట్‌కు సూచించాం. విషజ్వరాలు వచ్చినప్పుడు మన ఆయుర్వేద, హోమియోపతిల్లో చాలా రకాల మందులు వాడుతున్నారు. వాటి ఆధారంగా కొన్ని మందులను గుర్తించారు.
3. మంత్రుల టాస్క్‌ఫోర్స్ ఇప్పటివరకూ ఏం చేసింది?
ఇప్పటివరకూ రెండుసార్లు సమావేశమైంది. చైనాతో నిరంతరం సంప్రదింపులు జరుపుతోంది. ఎలాంటి ముందుజాగ్రత్త చర్యలు తీసుకుంటున్నారు, ఏ మందులు వాడుతున్నారన్న దానిపై విభిన్న దేశాలను అడిగి తెలుసుకుంటోంది. ఏ దేశంలో మందులు అందుబాటులో ఉన్నా తెప్పించుకోవాలని నిర్ణయించింది.
4. కరోనా వైరస్ నిర్ధరణ ఎలా జరుగుతోంది?
కరోనా వైరస్ గుర్తింపే అసలు సమస్య. ఈ వైరస్‌ను గుర్తించేందుకు అనువైన కొలమానం మన దగ్గర ఇంతవరకూ లేదు. అందుకే ఆ విషయాన్ని చైనానే అడిగి తెలుసుకున్నాం. హాంకాంగ్‌లో జరుగుతున్న పరీక్షలతో దాన్ని పోల్చుకుని ఆ వివరాలను అన్ని రాష్ట్రాలకూ పంపించి దేన్ని కరోనా వైరస్‌గా గుర్తించాలో స్పష్టంగా చెప్పాం.
5. అనుమానితులను ఒకే గదిలో ఉంచడం మంచిది కాదు కదా?