శ్రీకాకుళం అధికారుల మెనూ అనుసరించండి: రాష్ట్రాలకు కేంద్రం లేఖ - విద్యార్థులకు మధ్యాహ్న భోజనంపై రాష్ట్రాలకు కేంద్రం లేఖ
విద్యార్థులకు పాఠశాలల్లో పెట్టే మధ్యాహ్న భోజనంలో పోషకాలు అధికంగా ఉండే తృణధాన్యాలను వినియోగించాలని... కేంద్ర మానవవనరుల శాఖ రాష్ట్ర ప్రభుత్వాలకు సూచించింది. తృణధాన్యాల ఆధారిత మధ్యాహ్న భోజనం తిన్న పిల్లల్లో 50% అధికవృద్ధి ఉన్నట్లు. ఇక్రిశాట్ అధ్యయనంలో తేలిందని... మానవవనరుల శాఖ సంయుక్త కార్యదర్శి ఆర్సీ మీనా తెలిపారు.
విద్యార్థులకు పాఠశాలల్లో పెట్టే మధ్యాహ్న భోజనంలో పోషకాలు అధికంగా ఉండే తృణధాన్యాలను వినియోగించాలని కేంద్ర మానవవనరుల శాఖ రాష్ట్ర ప్రభుత్వాలకు సూచించింది. ఈ మేరకు ఆ శాఖ సంయుక్త కార్యదర్శి ఆర్సీ మీనా అన్ని రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలకు లేఖ రాశారు. వీటిని వినియోగించడం వల్ల విద్యార్థులకు సూక్ష్మ పోషకాలతో పాటు బి-కాంప్లెక్స్ అంది వారికి బహుముఖ ప్రయోజనాలు కలుగుతాయని పేర్కొన్నారు. అందుబాటులో ఉండే జొన్నలు, సజ్జలు, రాగులు, పిండి రూపంలో పిల్లలకు అందిచాలన్నారు. కర్ణాటకలో అక్షయపాత్ర ఫౌండేషన్ సరఫరా చేసిన తృణధాన్యాల ఆధారిత మధ్యాహ్న భోజనం తిన్న పిల్లల్లో 50% అధికవృద్ధి ఉన్నట్లు ఇక్రిశాట్ అధ్యయనంలో తేలిందని లేఖలో పేర్కొన్నారు. శ్రీకాకుళం జిల్లాలో ఐసీడీఎస్ కింద 3 నుంచి 6 ఏళ్ల చిన్నారులకు వారానికి నాలుగు రోజులు చిరుధాన్యాలతో కూడిన భోజనం అందిస్తున్న విషయాన్ని ఆర్సీ మీనా గుర్తుచేశారు. దీనివల్ల ఆ పిల్లల్లో 42% ప్రోటీన్లు, 2.6 రేట్ల క్యాల్షియం, 5 రేట్లు ఇనుము, 59%జింక్ పెరిగినట్లు తెలిపారు.
ఇదీ చదవండి:ప్రమాద మృతుల కుటుంబాలకు కమల్ ఆర్థిక సాయం
TAGGED:
millets