గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగుల ప్రొబేషనరీని ఖరారు చేసేందుకు నిర్వహించే రెండు పరీక్షల్లో ఒకటైన సీబీఏఎస్ (CBAS)ను రద్దు చేయాలని ముఖ్యమంత్రి జగన్ ఆదేశించినట్లు సీఎం ముఖ్య సలహాదారు అజేయ కల్లం తమకు చెప్పారని ఏపీ ప్రభుత్వ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు సూర్యనారాయణ తెలిపారు. సచివాలయ ఉద్యోగులకు సీబీఏఎస్ పరీక్షను తొలగించాలని కోరుతూ అజేయ కల్లంను సోమవారం సచివాలయంలో కలిసినట్లు ఆయన ఓ ప్రకటనలో తెలిపారు.
CBAS EXAM: సీబీఏఎస్ పరీక్ష రద్దు! - సీబీఏఎస్ పరీక్ష రద్దు
సచివాలయ ఉద్యోగులకు సీబీఏఎస్ పరీక్షను తొలగించాలని కోరుతూ సీఎం ముఖ్య సలహాదారు అజేయ కల్లంను కలసినట్లు ఏపీ ప్రభుత్వ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు సూర్యనారాయణ తెలిపారు. పరీక్షలు రద్దు చేయాలని ముఖ్యమంత్రి ఆదేశించినట్లు అజేయ కల్లం చెప్పారని.. ఆయన వెల్లడించారు.
cbas exam info
తమ విజ్ఞప్తిపై ఆయన స్పందించి సీఎంను సంప్రదించారని వివరించారు. పరీక్షను రద్దు చేసినందుకు సీఎంకు ధన్యవాదాలు తెలియజేస్తున్నట్లు పేర్కొన్నారు.
ఇదీ చదవండి:projects water flow: ప్రాజెక్టులకు తగ్గుతున్న వరద