ఆంధ్రప్రదేశ్

andhra pradesh

By

Published : Dec 25, 2019, 5:02 AM IST

ETV Bharat / city

'హోదా మార్చి బదిలీ చేస్తారా...ఎంత ధైర్యం..?'

ఐఆర్‌ఎస్‌ అధికారి జాస్తి కృష్ణకిశోర్​ సస్పెన్షన్​పై కేంద్ర పరిపాలనా ట్రైబ్యునల్ ఘాటుగా స్పందించింది. ఆయనపై చర్యలు చేపట్టేందుకు వీలుగా ప్రభుత్వం... దురుద్దేశంతో నిర్ణయం తీసుకుందని...ఇలా తీసుకునే అవకాశం ఎవరిచ్చారని ప్రశ్నించింది. ప్రభుత్వ తీరును తప్పుబట్టిన ట్రైబ్యునల్​ ఈ వ్యవహారాన్ని లోతుగా పరిశీలించాలని విచారణను జనవరి 31కి వాయిదా వేసింది.

cat on irs officer jasti krishna kishore
హోదా మార్చి బదిలీ చేస్తారా...ఎంత ధైర్యం?: క్యాట్

ఐఆర్‌ఎస్‌ అధికారి జాస్తి కృష్ణకిశోర్​​పై క్రమశిక్షణ చర్యలు తీసుకోవడానికి వీలుగానే ఆయనను ఏపీ ఆర్థికాభివృద్ధి మండలి సీఈవో పదవి నుంచి తొలగించినట్టు స్పష్టమవుతోందని కేంద్ర పరిపాలనా ట్రైబ్యునల్‌ (క్యాట్‌) పేర్కొంది. కృష్ణకిశోర్‌ను ఏపీఈడీబీ సీఈవో పదవి నుంచి ప్రభుత్వ ఎక్స్‌అఫీషియో కార్యదర్శిగా బదిలీ చేస్తూ ఉత్తర్వులివ్వడానికి సంస్థ బోర్డు నుంచి ఎలాంటి సూచన, నిర్ణయం లేవంది. రాష్ట్ర ప్రభుత్వ కార్యదర్శిగా డిప్యుటేషన్‌పై తీసుకోవడానికి ఎలాంటి ఆధారాలూ లేవని పేర్కొంది. ఆయనపై చర్యలు చేపట్టేందుకు వీలుగా దురుద్దేశంతోనే తీసుకుందని...ఇలా తీసుకునే అధికారం ఎవరిచ్చారని ప్రశ్నించింది. ఈ మొత్తం వ్యవహారంపై లోతుగా పరిశీలించాలన్న ట్రైబ్యునల్​ విచారణను జనవరి 31కి వాయిదా వేసింది. కృష్ణ కిశోర్‌ సస్పెన్షన్‌పై ఇచ్చిన మధ్యంతర స్టేను జనవరి నెలాఖరు వరకూ పొడిగించింది. ఆయనకు రావాల్సిన జీతాలను 2 వారాల్లో చెల్లించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది.

నిర్ణయం దారుణం...

తన సస్పెన్షన్‌పై ఏపీ ప్రభుత్వం జారీచేసిన ఉత్తర్వులను సవాల్‌ చేస్తూ జాస్తి కృష్ణకిశోర్‌ క్యాట్‌ను ఆశ్రయించారు. దీనిపై క్యాట్‌ ఛైర్మన్‌ జస్టిస్‌ ఎల్‌.నరసింహారెడ్డి, సభ్యులు బీవీ సుధాకర్‌లతో కూడిన ధర్మాసనం విచారణ చేపట్టింది. కృష్ణకిశోర్​ను సస్పెండ్‌ చేయడం సహా చర్యలు తీసుకోవాలన్న నిర్ణయం తీసుకోవడం చాలా దురదృష్టకరమని క్యాట్‌ వ్యాఖ్యానించింది.

ఇవీ చూడండి:

'అమరావతిని ముంచింది వరద కాదు... వైకాపా'

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details