ఆంధ్రప్రదేశ్

andhra pradesh

By

Published : Dec 24, 2019, 5:07 PM IST

Updated : Dec 24, 2019, 5:22 PM IST

ETV Bharat / city

పరిపాలనా తీరు ఇదేనా?

ఐఆర్ఎస్ అధికారి జాస్తి కృష్ణకిషోర్ సస్పెన్షన్​ విషయంలో రాష్ట్ర ప్రభుత్వ తీరుపై క్యాట్ ఆగ్రహం వ్యక్తం చేసింది.

cat on ap govt on jasti krishna kihore suspension
పరిపాలనా తీరు ఇదేనా?

ఏపీ ప్రభుత్వం తనను సస్పెండ్ చేయటాన్ని సవాల్ చేస్తూ... కృష్ణకిషోర్ దాఖలు చేసిన పిటిషన్​పై ఇవాళ మరోసారి విచారణ జరిగింది. ఐఆర్ఎస్ అధికారి సస్పెండ్​పై ప్రభుత్వం కౌంటర్ దాఖలు చేసింది. జాస్తి కృష్ణకిషోర్ సస్పెన్షన్​ విషయంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ తీరుపై కేంద్ర పరిపాలన ట్రైబ్యునల్ ఆగ్రహం వ్యక్తం చేసింది. కేంద్ర సర్వీసులకు తిరిగి వెళ్తానన్న అధికారిపై ఎందుకు సస్పెన్షన్ విధించారని ప్రశ్నించింది. ఉద్దేశపూర్వకంగానే కృష్ణకిషోర్​కు హాని కలిగించేలా వ్యవహరిస్తున్నారని క్యాట్ వ్యాఖ్యానించంది. కృష్ణకిషోర్​పై పలు ఆరోపణలు ఉన్నందునే సస్పెండ్ చేసినట్లు ప్రతివాదిగా ఉన్న ప్రభుత్వం వాదించింది. డిప్యూటేషన్ పూర్తయ్యేవరకూ వెనక్కి వెళ్లడానికి వీల్లేదని ప్రభుత్వం వాదనలు వినిపించింది.

Last Updated : Dec 24, 2019, 5:22 PM IST

For All Latest Updates

TAGGED:

ABOUT THE AUTHOR

...view details