రాజధాని వికేంద్రీకరణ, సీఆర్డీఏ బిల్లుల విషయంలో శాసనమండలి నిర్ణయాన్ని ఎమ్మెల్సీ బుద్ధా వెంకన్న స్వాగతించారు. బిల్లుల విషయంలో వైకాపా ప్రభుత్వం ఏకపక్షంగా ముందుకెళ్లేందుకు ప్రయత్నించినా... చివరకు రాష్ట్రానికి న్యాయం జరిగిందన్నారు. మంత్రులు, ఎమ్మెల్యేలు, విజయసాయిరెడ్డి, సుబ్బారెడ్డి వ్యక్తిగత ధూషణలకు మండలి ఛైర్మన్ షరీఫ్ లొంగలేదన్నారు. చంద్రబాబు 4 గంటలసేపు మండలి గ్యాలరీలో ఉండి చర్చను వీక్షించారన్న బుద్ధా... వైకాపా ప్రభుత్వానికి కౌంట్ డౌన్ మొదలైందన్నారు. రాజధాని ఇక్కడినుంచి తరలి వెళ్లేందుకు భగవంతుడూ ఒప్పుకోలేదన్న ఆయన... దౌర్జన్యం చేసినా, బెదిరించినా బిల్లులను మండలి ఛైర్మన్ ధైర్యంగా సెలెక్ట్ కమిటీకి పంపారన్నారు. సాక్షాత్తూ భగవంతుడే షరీఫ్ రూపంలో రాష్ట్రానికి న్యాయం చేశాడన్నారు. రాజధాని ఇక్కడే ఉంటుందని.. ఎక్కడకూ వెళ్లదని బుద్ధా పేర్కొన్నారు.
"భగవంతుడే షరీఫ్ రూపంలో రాష్ట్రానికి న్యాయం చేశాడు" - buddha reacts on council decision on crda, capital Decentralization in ap state
రాజధాని వికేంద్రీకరణ, సీఆర్డీఏ బిల్లుల విషయంలో రాష్ట్రానికి న్యాయం జరిగిందని ఎమ్మెల్సీ బుద్ధా వెంకన్న అభిప్రాయపడ్డారు. సాక్షాత్తూ ఆ భగవంతుడే షరీఫ్ రూపంలో రాష్ట్రాన్ని రక్షించాడన్నారు.
శాసనమండలి నిర్ణయంపై బుద్ధా వ్యాఖ్యలు