RRR Movie: ప్రముఖ నటులు రామ్చరణ్, జూనియర్ ఎన్టీఆర్ నటించిన 'ఆర్ఆర్ఆర్' చిత్రం నేడు విడుదలైన నేపథ్యంలో పలువురు సినిమా అద్భుతంగా ఉందని ప్రశంసల వర్షం కురిపిస్తుండగా.. ఓ ప్రముఖ వ్యక్తి చెత్త సినిమా తీసినందుకు రాజమౌళిని జైల్లో వేయాలంటూ విమర్శలు గుప్పించారు. ఆయన ఎవరో కాదు బాలీవుడ్ ప్రముఖ క్రిటిక్ కేఆర్కే. భారతీయ సినీచరిత్రలో అత్యంత చెత్త సినిమా తీసినందుకు దర్శకుడు రాజమౌళిని జైలులో వేయాలంటూ కేఆర్కే వ్యాఖ్యానించారు.
'చెత్త సినిమా తీసినందుకు రాజమౌళిని జైల్లో వేయాలి' - rajamouli
RRR Movie: దేశంలో ఎక్కడ చూసినా 'ఆర్ఆర్ఆర్' చిత్రం హంగామా కనిపిస్తోంది. పలువురు సినిమా అద్భుతంగా ఉందని ప్రశంసల వర్షం కురిపిస్తుండగా.. ఓ ప్రముఖ వ్యక్తి చెత్త సినిమా తీసినందుకు రాజమౌళిని జైల్లో వేయాలంటూ విమర్శలు గుప్పించారు.
RRR Movie
'ఆర్ఆర్ఆర్' చిత్రాన్ని తలాతోక లేని సినిమాగా అభివర్ణించారు. సినిమా చూసినందుకు తన నాలెడ్జ్ జీరో అయిందని ఆయన అన్నారు. దేశ వీరులను చెత్త సినిమాతో పోల్చడం నేరం అని ఆయన అన్నారు. రూ.600 కోట్ల బడ్జెట్తో స్క్రాప్ మూవీ తీసిన రాజమౌళిని 6నెలలు జైల్లో పెట్టాలని ట్విట్టర్ వేదికగా కేఆర్కే విమర్శించారు.
ఇదీ చదవండి: