ఆంధ్రప్రదేశ్

andhra pradesh

By

Published : Feb 7, 2020, 4:45 PM IST

ETV Bharat / city

రాజధానుల వికేంద్రీకరణకు భాజపా వ్యతిరేకం: కన్నా

ముఖ్యమంత్రి మారితే రాజధాని మారుతోందని తెలిస్తే రాష్ట్రానికి పెట్టుబడులు రావని భాజపా రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ అన్నారు. రాజధానుల వికేంద్రీకరణను భాజపా వ్యతిరేకిస్తోందని మరోసారి పునరుద్ఘాటించారు.

bjp state president kanna comments on capital change amaravthi
bjp state president kanna comments on capital change amaravthi

మూడు రాజధానులకు భాజపా వ్యతిరేకమన్న భాజపా నేత కన్నా

రాజధానుల వికేంద్రీకరణను భాజపా వ్యతిరేకిస్తోందని భాజపా రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ పునరుద్ఘాటించారు. హైదరాబాద్ నాంపల్లి భాజపా కార్యాలయంలో ఆ పార్టీ కోర్ కమిటీ భేటీ అనంతరం మాట్లాడిన ఆయన.. రాజధాని కోసం కేంద్రం రూ.2,500 కోట్లు ఇచ్చిందని తెలిపారు. రాజధాని అమరావతిలో రూ.9 వేల కోట్ల ప్రజాధనం ఖర్చు చేసినట్లు కన్నా పేర్కొన్నారు. రాజధాని అనేది అనేక అంశాలతో ముడిపడి ఉంటుందన్న కన్నా.. సీఎం మారితే రాజధాని మారుతోందని తెలిస్తే పెట్టుబడులు రావని వ్యాఖ్యానించారు. రాజధాని మార్పుపై నిర్ణయం తీసుకునే హక్కు సీఎం జగన్​కు లేదని అన్నారు. పౌరసత్వ సవరణ చట్టంపై ప్రజలకు అవగాహన కల్పించే కార్యాచరణపై కోర్​ కమిటీ భేటీలో చర్చించినట్లు తెలిపారు.

For All Latest Updates

TAGGED:

ABOUT THE AUTHOR

...view details