రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేశ్ కుమార్ విషయంలో హైకోర్టు వెలువరించిన సంచలనాత్మక తీర్పు వైకాపా ప్రభుత్వానికి చెంపపెట్టని భాజపా ఎంపీ జీవీఎల్ నర్సింహారావు అన్నారు. తొందరపాటు నిర్ణయాలు తీసుకుంటే...ఇలాంటి చర్యలే పునరావృతమవుతాయన్నారు. రాజ్యాంగ వ్యవస్థలో ప్రభుత్వాలకు పరిమితమైన అధికారాలుంటాయనే విషయాన్ని తెలుసుకుని వ్యవహరించాలన్నారు.
హైకోర్టు తీర్పు రాష్ట్ర ప్రభుత్వానికి చెంపపెట్టు: జీవీఎల్
ఎస్ఈసీ విషయంలో హైకోర్టు వెలువరించిన తీర్పు రాష్ట్రప్రభుత్వానికి చెంపపెట్టు అని భాజపా ఎంపీ జీవీఎల్ నర్సింహారావు అన్నారు.
భాజపా ఎంపీ జీవీఎల్ నర్సింహారావు
ఎస్ఈసీ రమేశ్ కుమార్ కూడా నిష్పక్షపాతంగా ఎలా పని చేయాలనే విషయాన్ని గుర్తించి నడుచుకోవాలన్నారు. రాజ్యాంగ వ్యవస్థలను నిలపాల్సిన బాధ్యత ప్రతి ఒక్క రాజ్యాంగ పదవిని నిర్వహించే వారిపై ఉంటుందన్నారు.
ఇవీ చదవండి:హైకోర్టు తీర్పుపై పవన్ హర్షం
TAGGED:
Bjp MP GVL Narsimha Rao news