ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

భాజపా అంటే కేసీఆర్​కు భయం పట్టుకుంది: బండి సంజయ్​ - గ్రేటర్​ ఎన్నికలు

భాజపా అంటే కేసీఆర్​కు భయం పట్టుకుందని భాజపా తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్​ విమర్శించారు. హైదరాబాద్​ హరితప్లాజాలో ఏర్పాటు చేసిన భారతీయ ఏక్తా సంఘటన్‌ కార్యక్రమంలో ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షుడు లక్ష్మణ్​తో కలిసి బండి సంజయ్​ పాల్గొన్నారు. భాజపాను గెలిపిస్తే పాతబస్తీని భాగ్యనగరంగా మారుస్తామని బండి సంజయ్​ అన్నారు.

bandi-sanja
bandi-sanja

By

Published : Nov 22, 2020, 9:09 PM IST

ప్రధాని నరేంద్రమోదీ ముస్లిం సమాజం నష్టపోతుందనే ట్రిపుల్ తలాక్‌ను రద్దు చేశారని భాజపా తెలంగాణ అధ్యక్షుడు బండి సంజయ్‌ అన్నారు. రాష్ట్రంలో 2023 ఎన్నికల్లో భాజపా అధికారంలోకి వస్తుందని బండి సంజయ్ పేర్కొన్నారు. భాజపా అంటే కేసీఆర్‌కు భయం పట్టుకుందన్నారు. కుటుంబ పాలనకు చరమగీతం పాడాలంటే భాజపాను గెలిపించాలని కోరారు.

హైదరాబాద్ హరిత ప్లాజాలో హైదరాబాద్‌లో స్థిరపడిన వివిధ రాష్ట్రాలకు చెందిన మైనార్టీల ఆధ్వర్యంలో భారతీయ ఏక్తా సంఘటన్‌ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి బండి సంజయ్‌తో పాటు ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షుడు కె.లక్ష్మణ్ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. భాజపాను గెలిపిస్తే పాతబస్తీని భాగ్యనగరంగా మారుస్తామని బండి సంజయ్​ వెల్లడించారు. అన్ని వర్గాలను సమానంగా చూస్తేనే నగరం అభివృద్ది చెందుతుందన్నారు. హైదరాబాద్‌ను అభివృద్ది చెందిన అహ్మదాబాద్, ఇండోర్, సూరత్‌ గా మారుస్తామన్నారు. ఎల్‌ఆర్‌ఎస్‌ పోవాలంటే భాజపా రావాలన్నారు.

భాజపా అంటే కేసీఆర్​కు భయం పట్టుకుంది: బండి సంజయ్​

డల్లాస్​ చేస్తానని.. కల్లాస్​ చేశారు..

ప్రజాక్షేత్రంలో ఓడించినా మేనేజ్‌మెంట్‌ కోటలో కేసీఆర్‌ కూతురు పదవులు దక్కించుకున్నారని ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షుడు లక్ష్మణ్ ఆరోపించారు. ముస్లింల కోసం ఎంఐఎం ఏమిచేయలేదన్నారు. హైదరాబాద్‌ను కేసీఆర్‌ కుటుంబం నుంచి కాపాడాలని లక్ష్మణ్ పేర్కొన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్​ హైదరాబాద్​ను డల్లాస్​ను చేస్తానని... కల్లాస్​ చేశారని విమర్శించారు. వేలాది కాలనీలు వరదల్లో మునిగినా పట్టించుకోలేదన్నారు. హైదరాబాద్​ను కేసీఆర్​ కుటుంబం నుంచి కాపాడాలన్నారు. కేటీఆర్ విజన్ అని పెద్ద మాటలు మాట్లాడుతున్నారని.. కానీ కనీసం డ్రైనేజి వ్యవస్త కూడా సరిగా లేదని లక్ష్మణ్​ మండిపడ్డారు.

ఇవీ చూడండి:

పాస్టర్ ముసుగులో మోసం... న్యాయం కోరుతూ బాధితురాలి ఆందోళన

ABOUT THE AUTHOR

...view details