- ఎస్పీవై ఆగ్రోలో లీకైనా విషవాయువు
కర్నూలు జిల్లా నంద్యాలలోని ఎస్పీవై ఆగ్రో పరిశ్రమలో విషవాయువు లీకైంది. ఈ ఘటనలో కంపెనీ జనరల్ మేనేజర్ శ్రీనివాసరావు మృతి చెందారు. ప్రమాదం జరిగిన సిబ్బంది బయటకు పరుగులు తీశారు. మరిన్ని వివరాలకు క్లిక్ చేయండి
- అవినీతిపై ఆధారాలు లేవు: కేంద్ర జలశక్తి శాఖ
పోలవరం ప్రాజెక్టులో అవినీతిపై ఆధారాల్లేవని కేంద్రజల శక్తి శాఖ స్పష్టం చేసింది. ప్రాజెక్టులో అవినీతి జరిగిందన్న ఆరోపణలపై విచారణ అవసరం లేదని తేల్చిచెప్పింది. పెంటపాటి పుల్లారావు అనే సామాజిక వేత్త ఫిర్యాదుకు స్పందించిన జలశక్తి శాఖ.... ఈ మేరకు సమాధానం ఇచ్చింది. మరిన్ని వివరాలకు క్లిక్ చేయండి
- ప్రియుడి కోసం భర్తను చంపిన భార్య
నిండు నూరేళ్లు కలిసుంటామని పెళ్లినాడు చేసిన ప్రమాణాలను మరిచి.. క్షణిక సుఖం కోసం జీవితాలను నాశనం చేసుకుంటున్నారు కొందరు. వివాహేతర సంబంధాలు.. హత్యలకు దారితీస్తున్న ఉదంతాలు... ఇటీవల కాలంలో ఎక్కువయ్యాయి. ఇలాంటి ఘటనే తాజాగా తూర్పుగోదావరి జిల్లాలో చోటుచేసుకుంది. అక్రమ సంబంధానికి అడ్డుగా ఉన్నాడని ప్రియుడు సహకారంతో భర్తను హతమార్చింది ఓ వివాహిత. ఆమె కుమార్తె ఫిర్యాదుతో ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. మరిన్ని వివరాలకు క్లిక్ చేయండి
- ముగ్గురు వైద్య విద్యార్థులకు కరోనా
గుంటూరు సర్వజనాసుపత్రి (జీజీహెచ్)లో శిక్షణ పొందుతున్న ముగ్గురు వైద్య విద్యార్థులకు కరోనా పాజిటివ్‌గా శుక్రవారం నిర్ధారణ జరిగింది. మరిన్ని వివరాలకు క్లిక్ చేయండి
- మెరుగ్గానే ఉన్నాం
కరోనా నియంత్రణలో భారత్ మెరుగ్గానే ఉందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పేర్కొన్నారు. భారత్‌లో రికవరీ రేటు క్రమంగా పెరుగుతోందని చెప్పారు. డా. జోసెఫ్ మర్తోమా 90వ జన్మదిన వేడుకల కార్యక్రమంలో పాల్గొన్నారు మోదీ. సమాజ ఉన్నతికి జోసెఫ్ తన జీవితాన్ని అంకితం చేశారని కొనియాడారు. మరిన్ని వివరాలకు క్లిక్ చేయండి
- పక్షుల కిల కిలలే.. ఆమె గుండె చప్పుడు