నూతన సంవత్సరం సందర్భంగా మద్యం దుకాణాలు, బార్ అండ్ రెస్టారెంట్లు, పబ్బుల సమయాలను తెలంగాణ ప్రభుత్వం పొడిగించింది. ఈనెల 31న అర్ధరాత్రి 12 గంటల వరకు మద్యం దుకాణాల్లో అమ్మకాలను అనుమతిని ఇస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.
న్యూ ఇయర్ గిఫ్ట్: తెలంగాణలో బార్లు, క్లబ్బులకు అర్ధరాత్రి వరకు అనుమతి - wine shops permission news
తెలంగాణలో కొత్త సంవత్సరం సందర్భంగా మద్యం దుకాణాలు, బార్ అండ్ రెస్టారెంట్లు, పబ్బుల సమయాలను ప్రభుత్వం పొడిగించింది. మద్యం దుకాణదారులు, బార్ అండ్ రెస్టారెంట్లు, పబ్బుల యాజమానుల విజ్ఞప్తి మేరకు ఈనెల 31న 12 గంటల వరకు అమ్మకాలను అనుమతిని ఇస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.
న్యూ ఇయర్ గిఫ్ట్: తెలంగాణలో బార్లు, క్లబ్బులకు అర్ధరాత్రి వరకు అనుమతి
అర్ధరాత్రి ఒంటి గంట వరకు బార్ అండ్ రెస్టారెంట్లు, పబ్బులు తెరిచి ఉంచేందుకు సర్కారు అనుమతిచ్చింది. నూతన సంవత్సరం సందర్భంగా మద్యం దుకాణదారులు, బార్ అండ్ రెస్టారెంట్లు, పబ్బుల యాజమానుల విజ్ఞప్తి మేరకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు ప్రభుత్వం పేర్కొంది. రాష్ట్రంలోని 2,216 మద్యం దుకాణాలు, దాదాపు 800 బార్ అండ్ రెస్టారెంట్లు పొడిగించిన సమయాలు వర్తించనున్నాయి.
ఇదీ చూడండి:కేంద్ర మంత్రులకు మంత్రి కేటీఆర్ లేఖ