APMDC MD: ఖనిజాల తవ్వకంలో విప్లవాత్మక మార్పులు తెచ్చామని ఏపీఎండీసీ ఎండీ వి.జి.వెంకట్‌రెడ్డి అన్నారు. రాష్ట్రంలో బీచ్ సాండ్ తవ్వకాలకు సంబంధించి 16 లీజులు ఉన్నాయని అన్నారు. ఏపీఎండీసీ మినహా ఎవరూ తవ్వకాలు చేసేందుకు వీలులేదని స్పష్టం చేశారు. ప్రస్తుతం 2 లీజులు మాత్రం డిపార్ట్మెంట్ ఆఫ్ ఆటమిక్ ఎనర్జీకి అనుమతులు ఇచ్చిందని... కానీ ఎక్కడా మైనింగ్ చేయడం లేదని తెలిపారు. మైనింగ్ ప్రొసీజర్ పూర్తి చేయాలంటే కనీసం ఏడాదిన్నర సమయం పడుతుందని వెల్లడించారు. బీచ్ సాండ్‌లో మోనోజైట్ వ్యూహాత్మక ఖనిజమని... ఇది ఎవరికి పడితే వారికి విక్రయించే అవకాశం లేదని స్పష్టం చేశారు. అవన్నీ కేంద్ర గనుల శాఖ, అణు శక్తి శాఖ పర్యవేక్షణలో జరుగుతాయని వివరించారు. తవ్వకాలకే అనుమతి రానప్పుడు వాటిని కేంద్ర గనుల శాఖ ఎలా రద్దు చేస్తుందని ప్రశ్నించారు.
APMDC MD: "ఖనిజాల తవ్వకంలో... విప్లవాత్మక మార్పులు తెచ్చాం" - ఏపీ లేటెస్ట్ అప్డేట్స్
APMDC MD: ఖనిజాల తవ్వకంలో విప్లవాత్మక మార్పులు తెచ్చామని ఏపీఎండీసీ ఎండీ వి.జి.వెంకట్‌రెడ్డి అన్నారు. ఈ ఆర్థిక సంవత్సరంలో గనుల ద్వారా రూ.5 వేల కోట్ల ఆదాయం లక్ష్యంగా పెట్టుకున్నట్లు పేర్కొన్నారు. బాక్సైట్ తవ్వకాలపై లండన్‌కు చెందిన లోరస్ అల్‌ఖైమాతో ఆర్బిట్రేషన్ పూర్తైనట్లు తెలిపారు.
APMDC MD: మే మొదటి వారం నుంచి ఇ-వేలం విధానం అమలు అవుతుందన్నారు. అల్ప ఖనిజాల తవ్వకాల విషయంలో విప్లవాత్మక సంస్కరణలు వచ్చాయని తెలిపారు. జీవో 13,14 విషయంలోనూ కొన్ని అపోహలు ఉన్నాయన్నారు. 'ఫస్ట్ కమ్ ఫస్ట్ సర్వ్' అనే విధానంలోనే ఇప్పటి వరకూ గనులు కేటాయింపు జరిగిందని, ఇక ఇ-వేలం ద్వారా ఇచ్చేందుకు, రెడ్ టేపిజం లేకుండా చూసేందుకు కొత్త విధానం అమలు చేస్తున్నామని వెల్లడించారు. ఔత్సాహిక పారిశ్రామిక వేత్తలను ప్రోత్సాహించేందుకు, గరిష్ఠంగా ప్రభుత్వం ఆదాయం పెంచటంలో కొత్త విధానం వెసులుబాటు ద్వారా కలిగిందని పేర్కొన్నారు.
APMDC MD: గత ఫిబ్రవరి నుంచి ఇప్పటి వరకూ 500 వరకు లీజులు ఇవ్వగలిగామని... ఇంకా 2,300 వరకు లీజులు ఇవ్వాల్సి ఉందని వివరించారు. దేశవ్యాప్తంగా మైనర్ మినరల్స్ తవ్వకాల్లో ఏపీ 24 శాతం వాటా కలిగి ఉందన్న వెంకట్ రెడ్డి... గత ఏడాది రూ.3700 కోట్ల ఆదాయం వచ్చిందని పేర్కొన్నారు. ఈ ఆర్ధిక సంవత్సరంలో రూ.5 వేల కోట్ల ఆదాయం లక్ష్యంగా పని చేస్తున్నామన్నారు. ఈసీ లేకుండా ఉన్న లీజులు 6500 వరకు ఉన్నాయని... వీటిని దశల వారిగా వేలం వేయాలని భావిస్తున్నట్లు తెలిపారు. ప్రస్తుతం అన్ని అనుమతులు ఉన్న లీజులు 1000 వరకు ఉన్నాయని చెప్పారు. బాక్సైట్ తవ్వకాలపై లండన్‌కు చెందిన లోరస్ అల్‌ఖైమాతో ఆర్బిట్రేషన్ పూర్తైనట్లు ప్రకటించారు. త్వరలోనే రాకీయాకు నష్టపరిహారం చెల్లించాల్సి ఉంటుందని తెలిపారు.
ఇదీ చదవండి: Students Fights: రోడ్డుపై కొట్టుకున్న విద్యార్థులు.. ఎందుకంటే..!