అగ్రిగోల్డ్ సంస్థకు సంబంధించిన స్థలాలను ఏపీ టిడ్కో, రాష్ట్ర గృహ నిర్మాణ సంస్థ ద్వారా తీసుకుని మార్కెట్ విలువ ప్రకారం కోర్టులో డబ్బులు డిపాజిట్ చేసేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందని వైకాపా ఎమ్మెల్సీ లేళ్ల అప్పిరెడ్డి ఆదివారం విలేకరులతో చెప్పారు. అగ్రిగోల్డ్ బాధితుల సమస్య పరిష్కారానికి ఫాస్ట్‌ట్రాక్ కోర్టు ఏర్పాటు చేయాలన్న యోచనలో ప్రభుత్వం ఉందన్నారు.
సంస్థలో రూ.20 వేలలోపు డిపాజిట్ చేసిన బాధితులకు ఈ నెల 24న ప్రభుత్వం డబ్బు చెల్లించనుందని తెలిపారు. రూ.10 వేల లోపు డిపాజిట్‌దారుల్లో మిగిలిపోయిన వారి నుంచీ దరఖాస్తులను తీసుకున్నట్లు వివరించారు. ఈ నె 24న నగదు జమ కావడంలో ఇబ్బందులెదురైతే పార్టీ పరంగా ఏర్పాటు చేసిన టోల్‌ఫ్రీ నంబరు దృష్టికి తీసుకురావాలని అప్పిరెడ్డి సూచించారు.