ధూళిపాళ్ల నరేంద్ర దాఖలు చేసిన క్వాష్ పిటిషన్‌పై హైకోర్టులో వాదనలు ముగిశాయి. ప్రతిపక్ష పార్టీలో ఉండి పోరాడతున్నందుకే తమపై అక్రమంగా కేసు నమోదు చేసి అరెస్ట్ చేశారని ధూళిపాళ్ల తరపు న్యాయవాది వాదించారు. ఈ చర్య చట్ట విరుద్ధమని తెలిపారు. ఎఫ్ఐఆర్ ఆధారంగా చేపట్టే తదుపరి చర్యలన్నింటినీ నిలువరిస్తూ మధ్యంతర ఉత్తర్వులివ్వాలని కోరారు. ప్రభుత్వం తరపున న్యాయవాది వాదనలు వినిపించారు. ఇరువురి వాదనలు విన్న న్యాయస్థానం తీర్పును రిజర్వ్ లో ఉంచింది. సంగం డెయిరీ కేసులో ఏసీబీ నమోదు చేసిన కేసును సవాల్ చేస్తూ ధూళిపాళ్ల.. రాష్ట్ర ఉన్నత న్యాయస్థానంలో క్వాష్ పిటిషన్ దాఖలు చేసిన విషయం తెలిసిందే.
ధూళిపాళ్ల క్వాష్ పిటిషన్‌పై హైకోర్టులో ముగిసిన వాదనలు
ధూళిపాళ్ల క్వాష్ పిటిషన్‌పై హైకోర్టులో వాదనలు ముగిశాయి. ఇరువైపు వాదనలు విన్న కోర్టు.. తీర్పును రిజర్వు చేసింది.
dhulipalla narendra arrest