గత ప్రభుత్వ నిర్ణయాలపై మంత్రివర్గ ఉపసంఘం, ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని (సిట్) ఏర్పాటు చేయడాన్ని సవాలు చేస్తూ తెదేపా సీనియర్ నేతలు వర్ల రామయ్య, ఆలపాటి రాజేంద్రప్రసాద్ హైకోర్టులో దాఖలు చేసిన వ్యాజ్యాలపై విచారణ సెప్టెంబర్ 7కి వాయిదా పడ్డాయి. మంగళవారం జరిగిన విచారణలో.. మరికొన్ని వివరాలు సమర్పించడం కోసం గడువు కావాలని ప్రభుత్వ న్యాయవాది కోరడంతో అంగీకరించిన న్యాయమూర్తి జస్టిస్ రజని విచారణను వాయిదా వేశారు. అయితే సాధారణ పరిపాలన శాఖ ముఖ్య కార్యదర్శి ప్రవీణ్ ప్రకాశ్ ఈ వ్యాజ్యాల్లో కౌంటర్ దాఖలు చేస్తూ..... 'పాత ప్రభుత్వ నిర్ణయాల్ని సమీక్షిస్తేనే తప్పులు ఎక్కడ జరిగాయో తెలుసుకొని సరిదిద్దుకోవడానికి వీలుంటుంది. పాత నిర్ణయాలను సమీక్షించే అధికారం ప్రభుత్వానికి ఉంది. సిట్ ఏర్పాటు వల్ల పిటిషనర్లు ఎలా బాధితులవుతారో వ్యాజ్యాల్లో పేర్కొనలేదు. వాటిని కొట్టేయాల'ని కోరారు.
సిట్ పై వ్యాజ్యాల విచారణ 7కు వాయిదా - ఏపీ ప్రభుత్వం
గత ప్రభుత్వ నిర్ణయాలపై మంత్రివర్గ ఉపసంఘం, ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని (సిట్) ఏర్పాటు చేయడాన్ని సవాలు చేస్తూ దాఖలైన పిటిషన్లపై హైకోర్టు విచారణ జరిపింది. తదుపరి విచారణను సెప్టెంబరు 7కు వాయిదా వేసింది.
ap high court