ప్రైవేట్ వైద్య కళాశాలల్లో ఫీజులు తగ్గిస్తూ ప్రభుత్వం జారీ చేసిన జీవో 56 అమలుకు సంబంధించి హైకోర్టులో విచారణ జరిపింది. మైనార్టీ డెంటల్ కళాశాలలకు జీవోలో ఎందుకు మినహాయింపు ఇచ్చారని ప్రశ్నించింది. ఈ అంశంపై ప్రభుత్వం కౌంటర్ దాఖలు చేయాలని న్యాయస్థానం ఆదేశించింది. తదుపరి విచారణను ఈనెల 17కి వాయిదా వేసింది. ప్రజాప్రయోజన వ్యాజ్యంతో పాటు దాఖలైన మిగతా వ్యాజ్యాలతో కలిపి అదే రోజున విచారణ చేపడుతామని ధర్మాసనం స్పష్టం చేసింది.
'మైనార్టీ డెంటల్ కళాశాలలకు మినహాయింపు ఎందుకిచ్చారు'
జీవో 56లో మైనార్టీ డెంటల్ కళాశాలలకు ఎందుకు మినహాయింపు ఇచ్చారని హైకోర్టు ప్రశ్నించింది. ఈ కేసుకు సంబంధించి పూర్తి వివరాలతో కౌంటర్ దాఖలు చేయాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది.
ap high court