రైతు భరోసా కేంద్రాలను వ్యవసాయ ఉత్పత్తుల సేకరణ కేంద్రాలుగా కూడా నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. అన్ని వ్యవసాయ, ఉద్యాన ఉత్పత్తులను గిట్టుబాటు ధరలకు కొనుగోలు చేసేలా రైతు భరోసా కేంద్రాలకు ఆదేశాలు ఇచ్చింది. రాష్ట్ర వ్యాప్తంగా 10,641 రైతు భరోసా కేంద్రాలు వ్యవసాయ, ఉద్యాన ఉత్పత్తుల కొనుగోలు కేంద్రాలుగా వ్యవహరిస్తాయని ప్రభుత్వ ఉత్తర్వుల్లో పేర్కొంది.
రాష్ట్ర పౌర సరఫరాల శాఖతో పాటు మార్క్ ఫెడ్, ఆయిల్ ఫెడ్ , కాటన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా తదితర సంస్థలు రైతు భరోసా కేంద్రాలతో పంట ఉత్పత్తుల కొనుగోలు వ్యవహారంలో సమన్వయం చేస్తాయని ఉత్తర్వుల్లో వెల్లడించింది. ఈ-క్రాప్ బుకింగ్ ద్వారా రైతులు పండిస్తున్న పంటలకు సంబంధిచింన వివరాలను సేకరించాల్సిందిగా గ్రామ వ్యవసాయ సహాయకులకు సూచనలు జారీ చేసింది.