ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

10 వేల మెగావాట్ల సౌర విద్యుత్‌ ప్లాంట్‌ ఏర్పాటుకు అనుమతి

రాష్ట్రంలో వ్యవసాయానికి పగలు 9 గంటల ఉచిత విద్యుత్‌ను ఇచ్చేందుకు 10 వేల మెగావాట్ల సౌర విద్యుత్‌ ప్లాంట్‌ ఏర్పాటుకు పరిపాలన అనుమతులనిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులనిచ్చింది. నాణ్యమైన విద్యుత్ అందించడం సౌరవిద్యుత్​తోనే సాధ్యమని భావిస్తోంది.

By

Published : Jun 16, 2020, 12:35 PM IST

ap govt permission to 10 thousand megawatts solar plant
ap govt permission to 10 thousand megawatts solar plant

వ్యవసాయ పంపుసెట్లు ఏటా 3 శాతం పెరుగుతుండటంతో రాయితీ మొత్తం 2030-31 నాటికి రూ.17,819 కోట్లకు పెరుగుతుందని ప్రభుత్వం అంచనా వేసింది. ఈ నేపథ్యంలో పగలు 9 గంటల నాణ్యమైన ఉచిత విద్యుత్‌ అందించడం సౌర విద్యుత్‌తోనే సాధ్యమని భావిస్తోంది. ఇందులో భాగంగానే 10వేల మెగావాట్ల సౌర విద్యుత్ ప్లాంట్​ ఏర్పాటుకు పరిపాలన అనుమతులిస్తూ.. ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.

ఈ ప్లాంటు నిర్మాణ బాధ్యతను ఏపీ గ్రీన్‌ఎనర్జీ కార్పొరేషన్‌ పర్యవేక్షిస్తుందని ప్రభుత్వం పేర్కొంది. పారదర్శక విధానంలో బిడ్డింగ్‌ నిర్వహించాలని సూచించింది. ఈ ప్రాజెక్టుకు గ్రామపంచాయతీల ఆమోదం తీసుకోవాల్సిన అవసరం లేకుండా మినహాయింపునిచ్చింది.

ఇదీ చదవండి:నవరత్నాలకే ప్రాధాన్యం.. బడ్జెట్​ అంచనా రూ.2.30 లక్షల కోట్లు..!

ABOUT THE AUTHOR

...view details