AP Raj Bhavan: రాజ్ భవన్లో నిరాడంబరంగా నూతన సంవత్సర వేడుకలు నిర్వహించారు. గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ దంపతులకు పలువురు ప్రజాప్రతినిధులు, అధికారులు శుభాకాంక్షలు తెలిపారు. రాజ్ భవన్ రూపొందించిన 2022 సంవత్సర కాలమానిని రాజ్ భవన్ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఆర్ పి సిసోడియా, ఇతర అధికారుల సమక్షంలో గవర్నర్ ఆవిష్కరించారు.
ప్రధాన ఎన్నికల కమిషనర్ విజయానంద్ సిబ్బందితో కలికి వచ్చి గవర్నర్కు శుభాకాంక్షలు తెలిపారు. దేవదాయ శాఖ కార్యదర్శి వాణీ మోహన్ నేతృత్వంలో తిరుమల తిరుపతి దేవస్ధానం పండితులు మంత్రోచ్ఛరణతో గవర్నర్ దంపతులను అశీర్వదించి శ్రీవారి ప్రసాదం అందించారు. దుర్గామల్లేశ్వర స్వామి దేవస్థానం ఛైర్మన్ పైల సోమినాయిడు, ఈవో భ్రమరాంబ తదితరులు గవర్నర్ దంపతులకు శుభాకాంక్షలు తెలిపారు.