ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

ఆటో, టాక్సీ డ్రైవర్లకు ప్రభుత్వం తీపి కబురు - ఆటో, టాక్సీ డ్రైవర్లకు తీపికబురు

ఆటో, టాక్సీ డ్రైవర్లకు ప్రభుత్వం తీపి కబురు చెప్పింది. వచ్చే నెల 4 నుంచి రూ. 10 వేల ఆర్థిక సాయం అందజేయనున్నట్లు మంత్రి పేర్ని నాని తెలిపారు. లబ్ధిదారుల ఎంపికకు ఈ నెల 14 నుంచి దరఖాస్తులు స్వీకరిస్తున్నామన్నారు. తుది తేదీ 25గా ప్రకటించారు.

ap govt good news to auto, trally drivers

By

Published : Sep 12, 2019, 4:10 PM IST

ఆటో, టాక్సీ డ్రైవర్లకు ప్రభుత్వం తీపి కబురు

వచ్చే నెల నాలుగు నుంచి ఆటో , టాక్సీ డ్రైవర్లకు రూ. 10 వేల ఆర్థిక సాయం చేయనున్నట్లు మంత్రి పేర్ని నాని తెలిపారు. లబ్ధిదారుల ఎంపిక కోసం ఈ నెల 14 నుంచి దరఖాస్తులు స్వీకరిస్తామని వెల్లడించారు. ఆన్​లైన్, ఆఫ్​లైన్ ద్వారా దరఖాస్తులు చేసుకోవచ్చని పేర్కొన్నారు. ఫైనాన్స్ తో వాహనాలు తీసుకున్న వారికీ ఈ పథకం వర్తిస్తుందని అన్నారు. 4 లక్షల మంది లబ్ధిదారులు ఉన్నట్లు అంచనా వేశామని చెప్పారు. అంతకుమించి లబ్ధిదారులు వచ్చినా ఈ పథకం అమలు చేస్తామని స్పష్టం చేశారు. దరఖాస్తుల స్వీకరణకు ఈ నెల 25 తుది గడువన్న ఆయన... టూ వీలర్‌ టాక్సీ డ్రైవర్లకు ఈ పథకం వర్తించదని ప్రకటించారు. వచ్చే ఏడాది నుంచి టూ వీలర్‌ టాక్సీ డ్రైవర్లకు ఆర్థిక సాయం అందించే ఆలోచన చేస్తామని చెప్పారు. ఈ పథకం పేరు, దరఖాస్తుల వివరాలు 14 వ తేదీన వెల్లడవుతాయని తెలిపారు. అర్హుడైన ప్రతి లబ్దిదారుడికి వారి ఖాతాల్లో 4వ తేదీన డబ్బు జమ అవుతుందని అన్నారు.

ABOUT THE AUTHOR

...view details