ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

హైకోర్టు స్టేలపై మరోసారి సుప్రీంకోర్టుకు రాష్ట్ర ప్రభుత్వం

అమరావతి భూముల అంశం, మంత్రి వర్గ ఉపసంఘం, సిట్ దర్యాప్తుపై హైకోర్టు ఇచ్చిన మధ్యంతర ఉత్తర్వులను రాష్ట్ర ప్రభుత్వం సుప్రీంకోర్టులో సవాల్ చేసింది. హైకోర్టు స్టేలను ఎత్తివేయాలని సర్వోన్నత న్యాయస్థానాన్ని కోరింది.

హైకోర్టు స్టేలపై... సుప్రీంలో రాష్ట్ర ప్రభుత్వం మరో పిటిషన్
హైకోర్టు స్టేలపై... సుప్రీంలో రాష్ట్ర ప్రభుత్వం మరో పిటిషన్

By

Published : Sep 22, 2020, 8:35 PM IST

సుప్రీంకోర్టులో రాష్ట్ర ప్రభుత్వం మరో పిటిషన్ దాఖలు చేసింది. అమరావతి రాజధాని భూముల అంశంలో హైకోర్టు ఆదేశాలను రాష్ట్ర ప్రభుత్వం సుప్రీంకోర్టులో సవాల్ చేసింది. హైకోర్టు మధ్యంతర ఆదేశాలను ఎత్తివేయాలని సుప్రీంను కోరింది. మంత్రివర్గ ఉపసంఘం, సిట్ దర్యాప్తుపై హైకోర్టు ఆదేశాలను సవాల్‌ చేస్తూ ఈ పిటిషన్‌ దాఖలు చేసింది.

అమరావతి భూముల అంశంపై ఏర్పాటు చేసిన సిట్‌, మంత్రివర్గ ఉపసంఘం తదుపరి కార్యాచరణపై హైకోర్టు ఇటీవల స్టే ఇచ్చింది. అమరావతి భూముల అంశంపై ప్రభుత్వం సోమవారం ఒక పిటిషన్ దాఖలు చేసింది.

ఇదీ చదవండి :దుర్గ గుడి రథం సింహాల కేసు...అనుమానితుల విచారణ

ABOUT THE AUTHOR

...view details